Rachin Ravindra : ఈ ఏడాది క్రికెట్ ప్రపంచంలోకి ఉప్పెనలా దూసుకువచ్చిన ఆటగాడు రచిన్ రవీంద్ర. ఈ స్పిన్ ఆల్ రౌండర్ వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి రికార్డ్స్ బద్దలుకొట్టాడు. ఈ ఏడాది వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరఫున హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. దాంతో అతని పేరు మార్మోగిపోయింది. ఫామ్ లో ఉన్న రచిన్ హిట్టింగ్ చేయడంతో పాటు స్పిన్ బౌలింగ్ తో వికెట్లు కూడా తీయగలడు. దాంతో ఐపీఎల్ జట్టు ఈ స్టార్ కివిస్ ప్లేయర్ ను దక్కించుకోవడానికి పోటీపడుతున్నాయి.
Advertisement
లీగ్ లో ఉన్న 10 జట్లు ఈ ఆటగాడి కోసం పోటీలో ఉండగా…. రెండు జట్లు మాత్రం ఎలాగైనా ఇతన్ని తీసుకోవాలని చూస్తున్నాయి. వాటిలో ఆర్సిబి, ఎస్ఆర్హెచ్ ఉన్నాయి. స్టార్ ఆటగాళ్లను ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడంలో ఈ రెండు జట్లు ప్రతి ఏడాది ముందు వరుసలో ఉంటాయి. అందుకే ఈసారి ఈ రెండు జట్లు రచిన్ కోసం వేలంలో చివరివరకు పోరాడుతాయని సమాచారం. ఇక 2024 ఐపీఎల్ మార్చిలోనే స్టార్ట్ చేసే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఎన్నికలు, టి20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో మార్చిలో ఐపిఎల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఈనెల 19న ఐపీఎల్ మినీ వేలం దుబాయ్ లో నిర్వహిస్తారు. ఈ మినీ వేలంలో కోసం 1,166 మంది ప్లేయర్స్ పేర్లు నమోదు చేశారు. రచిన్ కూడా తన పేరును నమోదు చేశారు. మొత్తం 77 మంది ప్లేయర్స్ కోసం 232 కోట్లు ఖర్చు చేస్తారు. మరి అద్భుత ఫామ్ లో ఉన్న రచిన్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తీసుకుంటుందా? లేదా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేస్తుందా? అన్నది చూడాలి. ఇక గతంలో రచిన్ ఆర్సిబి తరఫున ఐపీఎల్లో ఆడాలని ఉందని తన కోరికను బయట పెట్టాడు. మరి వేలంలో అతని కోసం పోటీల్లో 10 కోట్ల వరకు ధర పలికే ఛాన్స్ ఉంది. ఆర్సిబిఎస్, ఎస్ఆర్ఎచ్ అంత ధరపెట్టి కొనుగోలు చేస్తాయా లేదా అన్నది చూడాలి.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.