Rishabh Pant : ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఎంతగానో అలరించే ఐపిఎల్ కు సూపర్ క్రేజ్ ఉంది. ఇప్పటికే ఐపీఎల్ లో 10 జట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ క్రేజ్ ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ధోని నాయకత్వంలో నడిచే ఈ జట్టు ఐదుసార్లు టైటిల్ గెలిచింది. ఇక ఈ జట్టులో చేరడానికి చాలామంది ప్లేయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు ఈ జట్టులో చేరే ఆటగాళ్ల జాబితాలో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ చేరాడు.
అంత సీఎస్కే లో చేరతాడని… అంతేకాకుండా సీఎస్కే జట్టుకి కెప్టెన్ అవుతాడని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా తెలిపాడు. 2025 ఐపీఎల్ కి పంత్ సీఎస్కే పగ్గాలు అందుకోవడం ఖాయమని ఆయన తెలిపాడు. పంత్ ధోనికి వీరాభిమాని అని, 2025 లో జరిగే ఐపీఎల్ కోసం జరిగే ట్రేడ్స్ లో పంత్ సీఎస్కే లో చేరతాడని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పంత్ ఢిల్లీకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది ప్రమాదం కారణంగా 2023 ఐపీఎల్ లో పంత్ ఆడడం లేదు. కానీ ప్రమాదం నుంచి కోలుకున్న పంత్ 2024 ఐపీఎల్లో ఆడటమే కాకుండా ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా ఉంటాడు.
Advertisement
Advertisement
అతని కెప్టెన్సీలో ఢిల్లీ జట్టు రాణించింది. అతను లేకపోవడంతో 2023 ఐపీఎల్ లో దారుణంగా విఫలమైంది. ఇక పంత్ సీఎస్కే లోకి వస్తాడని గుప్తా చెప్పిన వీడియో వైరల్ గా మారింది. 2024 ఐపిఎల్ లో ధోని ఆడుతున్నాడు. కానీ 2025 సీజన్ లో ఆడతాడా లేదా అన్నది అనుమానమే. ఒకవేళ ధోని రిటైర్ అయితే అతని ప్లేస్ లోకి తీసుకువచ్చి పంత్ ను తీసుకువచ్చిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ పంత్ సీఎస్కే లోకి వస్తే అతన్నే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారధిగా చేసే అవకాశం కూడా ఉంది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.