Home » కేవలం 17 ఏళ్లలో… జెడ్పీటీసీ నుండి సీఎం రేస్ లోకి… రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం…!

కేవలం 17 ఏళ్లలో… జెడ్పీటీసీ నుండి సీఎం రేస్ లోకి… రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం…!

by Sravya
Ad

తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి, కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీనే లేదన్న పరిస్థితి నుండి రాష్ట్రంలో అధికారం చేపట్టే స్థాయికి చేరుకుంది. ఇందుకు కారణం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కృషి. ఆయన పోరాటం వలన ఈరోజు విజయం కాంగ్రెస్ కి దక్కింది. రేవంత్ రెడ్డి ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించారుట. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా వెన్ను చూపకుండా వెనుకడుగు వేయకుండా రేవంత్ రెడ్డి నిలబడ్డారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కారణమైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏంటి, ఎదుర్కొన్న వడిదుడుకులు ఏంటి అనేది చూద్దాం.

Advertisement

విద్యార్థి దశ నుండి కూడా రేవంత్ రెడ్డి రాజకీయాలపై ఎంతో ఆసక్తిని చూపించేవారు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఏబీవీపీ నాయకుడిగా పని చేశారు. నేడు టిపిసిసి చీఫ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి. సీఎం గా బాధ్యతలను చేపట్టనున్నారు. అయితే వీటన్నిటికంటే ముందు రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని టిఆర్ఎస్ కార్యకర్తగా మొదలుపెట్టారు. 2004లో టిఆర్ఎస్ నుండి కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు రేవంత్. కెసిఆర్ కూడా రేవంత్ కి ఆ టికెట్ ని ఇప్పించడానికి ట్రై చేశారు.

Advertisement

కాంగ్రెస్తో పొత్తుల్లో భాగంగా రేవంత్ రెడ్డికి సీటు దక్కలేదు. 2006లో మిడ్జిల్ జడ్పిటిసి ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇస్తారని భావించినా, మళ్ళీ నిరాశ కలిగింది. దీంతో బిఆర్ఎస్ ని విడిచిపెట్టారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. టిడిపిలోకి అయిన ఆ తర్వాత చేరారు. అప్పుడు ఆక్టివ్ అయిపోయారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ కేటాయించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన రావులపల్లి గుర్నాథ్ రెడ్డి పై విజయాన్ని అందుకున్నారు.

2018లో ఓటీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. 2018 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి రేవంత్ రెడ్డి ఓడిపోయారు 2019 మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2021 లో రేవంత్ రెడ్డిని జాతీయ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్. నిత్యం ప్రజలకి టచ్ లో ఉంటూ పార్టీని బలంగా మార్చారు రేవంత్ రెడ్డి. మొత్తానికి ఇప్పుడు ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయాన్ని సాధించింది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading