తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు అంటే ఆదివారం రోజున రిలీజ్ కాబోతున్నాయి. నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పోలింగ్ జరిగిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో మిశ్రమ రిజల్ట్ వచ్చింది. ఈ సర్వే సంస్థలు కొన్ని భారత రాష్ట్ర సమితి పార్టీకి పాజిటివ్గా రిజల్ట్ ఇస్తే… కొన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చాయి. మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం హంగు ఏర్పడుతుందని… హంగు ఏర్పడినప్పటికీ సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్పాయి.
ఇలాంటి నేపథ్యంలోనే ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి కచ్చితంగా 45 సీట్లు వస్తాయని ప్రతి ఒక్క సర్వే తేల్చి చెప్పింది. అలాగే ఎంఐఎం పార్టీకి ఏడు సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఎలాగూ ఈ రెండు పార్టీలు కలిసిపోతాయి. అంటే సీఎం కేసీఆర్ చేతిలో 52 సీట్లు ఉన్నట్లు. అధికారం చేపట్టేందుకు మరో ఎనిమిది సీట్లు ఉంటే సరిపోతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను దాదాపు 20 మంది సీఎం కేసీఆర్ మనుషులే అని ప్రచారంలో ఉంది.
Advertisement
Advertisement
ఇదే విషయాన్ని తీన్మార్ మల్లన్న కూడా స్పష్టం చేశారు. ఆ 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ప్రచారానికి డబ్బులు ఇచ్చారని కూడా సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. అంటే సమయానికి అందులో పది మంది ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు సపోర్ట్ ఇచ్చిన అవలీలగా మరోసారి భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి రాబోతుందని చెబుతున్నారు. అటు ఎంతో ధీమాగా డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో మరోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.