చలికాలంలో, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా, చలి కాలంలో దగ్గు, జలుబు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నట్లయితే, ఇలా వెంటనే సమస్య నుండి బయటపడవచ్చు. జలుబు తగ్గడానికి, ముక్కు దిబ్బడ వంటి వాటి నుండి ఉపశమనం పొందాలంటే, ఇంట్లోనే మనం ఈ టానిక్ ని తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఈ టానిక్ ని, తయారు చేయడానికి ఐదు నుండి 6 మిరియాలు ని పొడి చేసుకొని పెట్టుకోండి. అలానే, ఒక టీ స్పూన్ తేనె కూడా తీసుకొని, అందులో మిక్స్ చేయండి. ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల నీళ్లు మిక్స్ చేసి, దీన్ని పల్చగా చేయండి.
Advertisement
Advertisement
ఈ టానిక్ ని రోజుకి మూడుసార్లు వరకు తీసుకోవచ్చు. జలుబు, ముక్కు దిబ్బడ త్వరగా తగ్గిపోతాయి. మిరియాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా మిరియాలలో విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఆయాసం వంటివి తగ్గుతాయి. అల్లం, తేనె, నల్ల మిరియాలు, నిమ్మరసం కూడా బాగా పనిచేస్తాయి
. తురిమిన అల్లం లో ఒక టీ స్పూన్ తేనె, మిరియాల పొడి, ఒక కాయ నిమ్మరసం కలిపి మిక్స్ చేయండి. టానిక్ ని రోజుకి రెండు మూడు సార్లు వరకు తీసుకోవచ్చు. అల్లం మిరియాల లో ఔషధ గుణాలు ఉంటాయి. అలానే రెండు కూడా చాలా రకాల సమస్యల్ని దూరం చేస్తాయి. తేనే విషయానికి వస్తే తేన శ్వాసకోశ సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!