Home » మీ పండు తింటే.. మీ లివర్ అత్యంత త్వరగా క్లీన్ అవుతుంది..!

మీ పండు తింటే.. మీ లివర్ అత్యంత త్వరగా క్లీన్ అవుతుంది..!

by Anji
Ad

సాధారణంగా మానవ శరీరంలో  కాలేయం అత్యంత ముఖ్యమైన భాగం. శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్ కంట్రోల్ చేస్తుంది. కొవ్వును తగ్గించడంలో కార్బోహైడ్రేట్లను నిల్వ చేయడంలో ప్రోటీన్లను తయారు చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు.. ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్ లను తయారు చేస్తుంది. మన శరీరంలోని కీలక అవయవమైన కాలేయం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. కొన్ని ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల లివర్ హెల్తీగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, సోడా, ఆల్కహాల్ ఇతర కార్బోనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. లేదంటే తీవ్రమైన కాలేయ సమస్యలు, ఊబకాయ, ఫ్యాటీ లివర్ సమస్యలు వస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే సిర్రోసిస్ కు దారితీస్తుంది. కాలేయం ఆరోగ్యానికి ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అందులో బొప్పాయి ఒకటి. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే బొప్పాయి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయి కాలేయంలో మంటను తగ్గించగలదని NIH నివేదిక సూచిస్తుంది. ఇది ప్రో ఇన్ ఫ్లమేటరీ సైటోకిన్ ల అధిక ఉత్పత్తి, కార్యకలాపాలను నిరోధించడం ద్వారా కాలేయ వాపును తగ్గించడంలో సహాయపడవచ్చు.నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి బొప్పాయిని ఉపయోగించవచ్చు.బొప్పాయిలో అనేక రకాల బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి అనేక కాలేయ సంబంధిత వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ మీ కాలేయ కణాలను శుభ్రపరచడంలో, వాటిని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో పాపైన్, చైమోపాపైన్ కూడా ఉన్నాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయి లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయ కణాలను నిర్విషీకరణ చేస్తుంది. వాటి పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి మీ కాలేయం దెబ్బతిన్నట్లయితే లేదా మీకు కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నట్లయితే మీరు బొప్పాయిని తినాలి.

మరికొన్ని తెలుగు లైఫ్ స్టైల్ వార్తలకు ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading