ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైయస్ భారతి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. వీరిద్దరికీ 1996లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. భారతి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. భారతి ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు బిజినెస్ వ్యవహారాలను కూడా చూసుకుంటుంది. ఈవిడ సిమెంట్ తయారీ సంస్థ అయినటువంటి భారతి సిమెంట్ సంస్థను నడిపిస్తోంది. అంతేకాకుండా సాక్షి వార్తాపత్రికను, సాక్షి టీవీ ఛానల్ ను కూడా దగ్గరుండి చూసుకుంటారు.
అయితే భారతి ఈ వ్యవహారాలను చూసుకుంటూ చాలా బిజీగా ఉండడం వల్ల రాజకీయాల్లోకి రాలేకపోయారు. ఇక రానున్న రోజుల్లో వైయస్ భారతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వైయస్ భారతి జీతం ఎంత? తన నెల సంపాదన ఎంత? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా దీనికి సంబంధించి అనేక రకాల వార్తలు వచ్చాయి. భారతి సిమెంట్ సంస్థ తరపున ఆమె భారీగానే జీతం తీసుకుంటుందని ఈడీ తెలియజేసింది.
Advertisement
Advertisement
భారతి సిమెంట్ కంపెనీలో డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నప్పటికీ ఎలాంటి అనుభవం లేకుండా కూడా భారతి ఎక్కువ వేతనం తీసుకుంటుందట. ఈ కంపెనీలో జగన్ కు ఉన్న షేర్ వల్ల భారతి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవల్లో భాగంగా ఓ పార్టీ నేత జగన్ భార్య భారతి తీసుకుంటున్న జీతం గురించి సాక్షాలతో బయటపెట్టాడు. భారతి సిమెంట్ కంపెనీలో…..భారతి ఒక్క ఏడాదికి మూడు నుంచి నాలుగు కోట్లు జీతం తీసుకుంటుందని తెలియజేశాడు. ఇక భారతికి వచ్చే జీతం గురించి తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!