Home » రాహుల్‌, పీవీ, కరుణానిధి, జయలలితతోనూ తలపడ్డ ఎలెక్షన్ కింగ్ ఎవరు..? ఆయన బాక్గ్రౌండ్ ఏమిటి..?

రాహుల్‌, పీవీ, కరుణానిధి, జయలలితతోనూ తలపడ్డ ఎలెక్షన్ కింగ్ ఎవరు..? ఆయన బాక్గ్రౌండ్ ఏమిటి..?

by Sravya
Ad

దేశ రాజకీయాలపై అవగాహన ఉన్న వాళ్ళకి పద్మ రాజన్ సుపరిచితం డాక్టర్ పద్మరాజన్ సామాన్య ప్రజలకి పెద్దగా తెలియదు. కానీ రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళకి కచ్చితంగా ఆయన గురించి పరిచయం చేయక్కర్లేదు. తమిళనాడు సేలం కి చెందిన హోమియోపతి వైద్యుడు ఈయన. ఈయన వయసు 66 ఏళ్ళు. ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది. అదే ఎలక్షన్ కింగ్. ఈయనకి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఏ ఎన్నికలు జరిగినా అందులో పోటీ చేస్తూ ఉంటాడు. 

ఈయన దేశంలోనే అత్యధిక సార్లు పోటీకి దిగిన అభ్యర్థిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటుగా, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఈయన చోటుని కైవసం చేసుకున్నారు. ఎక్కువసార్లు పోటీలో నిలబడడమే కాదు అత్యధిక సార్లు ఓడిపోయిన వ్యక్తిగా కూడా రికార్డులకు ఎక్కారు. 1986లో తన సొంత నియోజకవర్గం నుండి కూడా దేశంలో ఏ ఎన్నిక జరిగిన కూడా పోటీకి వస్తూ ఉంటాడు.

Advertisement

Advertisement

పద్మరాజు వార్డు మెంబర్ నుండి రాష్ట్రపతి దాకా ఎన్నికల్లో ఎన్నోసార్లు పోటీ చేశారు ఐదు రాష్ట్రపతి ఎన్నికలు, ఐదు ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 32 లోక్ సభ, 50 రాజ్యసభ, 72 అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా మూడుసార్లు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. 1986 నుండి ఇప్పటిదాకా కూడా ఈయన 20 లక్షలకి పైగా ఎన్నికల కోసం ఖర్చు చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలైనా కూడా నామినేషన్ వేయడంతో పద్మరాజుని ముద్దుగా ఎలక్షన్ కింగ్ అని పిలుస్తారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading