స్కిల్ స్కామ్ లో చంద్రబాబుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మధ్యంతర బెయిలు లభించి ఆయన బయటికి వచ్చారు. జగన్ సర్కార్ మాత్రం ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు.
Advertisement
వీలైనంత దాకా చంద్రబాబు ని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తోంది ఇక పూర్తి వివరాలు చూస్తే.. ఇసుక కుంభకోణం లో సిఐడి కేసు నమోదు చేసింది. ఏఐగా పీతల సుజాత, A2 గా చంద్రబాబు అలానే A3 చింతమనేని ప్రభాకర్, A4 గా దేవినేని ఉమా పై సిఐడి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఖజనా కి బాగా నష్టం కలుగుతుంది చంద్రబాబు ఆరోగ్య దృష్ట్యా మద్యంతర బెయిల్ ఇచ్చిన తరుణంలో అరెస్ట్ చేయబోమని సిఐడి క్లియర్ గా చెప్పింది. కోర్టు సైతం దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.చంద్రబాబు హయాంలో ఇష్టారాజ్యంగా సరఫరా చేసే కంపెనీలకు అనుమతులిచ్చి 1300 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు అన్నది ఆరోపణ దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తామని కోర్టు స్పష్టం చేస్తుంది.
Advertisement
ఇప్పుడు తాజాగా ఇసుక కుంభకోణం ఒకటి జరిగిందని వైసీపీ ప్రభుత్వం అంటోంది వైసిపి చంద్రబాబుపై కేసు నమోదు చేసింది చంద్రబాబు ఇప్పటికే తనపై తప్పుడు కేసులు పెట్టారని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీని మీద విచారణ సైతం పూర్తయింది తీర్పు న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈనెల 8న తీర్పుని ఇవ్వబోతోంది కోర్టు ఒకవేళ కనుక చంద్రబాబుని సమర్థిస్తూ కోర్టు తీర్పు చెప్పిందంటే ఈ కేసుల నుండి శాశ్వతంగా చంద్రబాబుకి విముక్తి కలుగుతుంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!