ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇన్నాళ్లుగా ఆయనకు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరు దేశాల పర్యటనలో అక్కడి ప్రధానులు, రాష్ట్రపతులు ఇచ్చిన మెమొంటోస్ ను అమ్మేస్తున్నారట. అయితే దీనికి ఓ ప్రధాన కారణముందట. ఆ కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం…. దీని ద్వారా వచ్చిన డబ్బులని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వనున్నారట. ఆ ప్రాజెక్టుకు డబ్బులను విరాళంగా ఇవ్వాలని మోదీ ఇలాంటి పని చేస్తున్నారట.
మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 912 మెమొంటోస్ వచ్చాయట. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మోదీని కలిసిన ప్రతిసారి దేవుని విగ్రహాలను ఇచ్చేవారట. అలా ఒక్కో రాష్ట్రానికి చెందిన సీఎంలు, మంత్రులు అక్కడి సాంప్రదాయాన్ని బట్టి ఏదో ఒక రూపంలో బహుమతులను ఇచ్చేవారట. ఇక ఇప్పుడు మోదీ వాటన్నింటినీ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ లో ఉంచి వీటిని విక్రయించబోతున్నారట.
Advertisement
Advertisement
అయితే వీటి విక్రయం ఇప్పటికే మొదలైంది. వీటికి గల చివరి తేదీ అక్టోబర్ 31 వరకు వీటి విక్రయం ఉంటుంది. ఇక ఇందులో ఎవరైనా పాల్గొని ఆ బహుమతులను కొనుగోలు చేయవచ్చట. ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాలను కొను క్కోవాలని ప్రధానమంత్రి కోరడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా బాగా డబ్బులు వస్తే అవి గంగానది ప్రక్షాళనకు ఉపయోగపడితే అంతకన్నా సంతోషం ఇంకేం ఉంటుందని మోదీ ట్వీట్ చేశారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.