Home » సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని మిస్ చేసుకున్న 8 మంది స్టార్స్..!!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని మిస్ చేసుకున్న 8 మంది స్టార్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొంతమంది హీరోల కాంబినేషన్లు చూస్తే అభిమానులకు ఎంతో ఆనందం కలుగుతుంది. మరో సినిమా రావాలనే ఫీలింగ్ కలుగుతుంది.. ఆ విధంగానే విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా సమంతా, అంజలి హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. టాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత రూపొందించిన మల్టీ స్టారర్ మూవీ.. ఈ మధ్యకాలంలో ఇలాంటి మల్టీ స్టార్ మూవీస్ ఎక్కువగా తెరక్కెక్కుతున్నాయి.

అలాంటి వాటిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. పెళ్లి సందడి సినిమాని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరించారో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని కూడా ఆ విధంగానే ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. ఇందులో వెంకటేష్ మరియు మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్. కుటుంబ కథ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం 2013 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఇప్పటికీ చిత్రం వచ్చి 10 ఏళ్ళు పూర్తయిపోయింది. అలాంటి ఈ సినిమాను ఈ స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారట. మరి వారెవరో మనము ఓ లుక్ వేద్దాం..

Advertisement

#1. రజినీ కాంత్ :

ప్రకాష్ రాజ్ చేసిన రేలంగి మావయ్య పాత్రకు ముందు రజనీ కాంత్ ను అనుకున్నారట దర్శకుడు. కానీ రజనీ నో చెప్పారు

#2. నాజర్ :

Advertisement

రేలంగి మావయ్య పాత్రకు నాజర్ ను కూడా అనుకున్నారట. ఈయన కూడా కుదరకపోవడంతో ప్రకాష్ రాజు ఫైనల్ చేశారు.

#3. పవన్ కళ్యాణ్ :

మహేష్ బాబు చిన్నోడు పాత్రకు మొదట పవన్ కళ్యాణ్ ను అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు పవన్.

#4. నాగార్జున:

వెంకటేష్ చేసిన పెద్దోడు పాత్రకు మొదట నాగార్జునను అనుకున్నారట. కానీ ఆయన చేయలేదు.

#5. విద్యా బాలన్:


అంజలి చేసిన సీత పాత్ర కోసకు సంప్రదిస్తే విద్యాబాలన్ నో చెప్పింది.

#6.భూమిక:

వెంకటేష్ క్యారెక్టర్ జోడీగా భూమికను అనుకున్నారు. కానీ ఒక్కడు మూవీలో మహేష్ కు జోడీగా చేసి వదినగా చేయడం ఇష్టం లేక ఆమె నో చెప్పింది.

#7.సుధ:

జయసుధ పాత్రకి ముందుగా ఈమెను అనుకున్నారు. కానీ లుక్ టెస్ట్ లో ఈమె ఆ పాత్రకు సెట్ కాలేదట.

#8.మణిశర్మ :

సంగీత దర్శకుడిగా ముందు. ఇతన్ని అనుకున్నారు. కానీ మిక్కీ జె మేయర్ ను ఫైనల్ చేశారు.

also read:సూర్యవంశం సినిమాలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? 

Visitors Are Also Reading