ఇండియాలో గడిచిన 24గంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా రోజుల తరవాత దేశంలో లక్షకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే దేశంలో 83,876 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisement
ప్రముఖ గాయని లతామంగేష్కర్ కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా నేడు లతా మంగేష్కర్‌కు పార్లమెంట్ ఉభయసభలు నివాళులు అర్పించనున్నాయి. సంతాప సూచకంగా గంటపాటు ఉభయసభలు వాయిదా వేయనున్నారు.
సీఎం కేసీఆర్ నేడు యాదాద్రికి వెల్లనున్నారు. ముగింపు దశలో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించడగానికి కేసీర్ యాదాద్రికి వెళుతున్నారు. ఆలయ పునఃసంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లపై కేసీఆర్ చర్చించనున్నారు.
నారాయణపేటలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఓ వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్ జరగ్గా వివాహానికి హాజరైన 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
Advertisement
కరోనా కేసులు తగ్గముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తోంది. దాంతో ఈరోజు నుండి స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సంస్థలు తెరుచుకోనున్నాయి. మొదటి దశలో 9-12 తరగతులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులను ప్రారంభించనున్నారు. 14వ తేదీ నుంచి నర్సరీ నుంచి 8వ తరగతి వరకు క్లాసుల పునః ప్రారంభం కానున్నాయి.
దేశంలో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అనుమతలు ఇచ్చింది. ఇప్పటి వరకూ దేశంలో ఎనిమిది రకాల వ్యాక్సిన్ లు ఉండగా అన్నీ రెండు డోసుల వ్యాక్సిన్ లే.
సీఎం జగన్ నేడు హైదరాబాద్ కు వస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న శ్రీసహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనబోతున్నారు.
రష్యా బ్రెజిల్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రష్యాలో కేసులు పది రెట్లు పెరగ్గా బ్రెజిల్ లో అత్యధిక మరణాలు నమోదవతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై జరిగిన కాల్పల అంశంపై కేంద్రమంత్రి అమిత్ షా నేడు లోక్ సభలో మరియు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు జిన్ పింగ్ తో చర్చలు జరిపాడు. పాకిస్థాన్ కు చైనా మద్దతు ఉంటుందని ఈ చర్చల్లో నిర్నయించారు.