Telugu News » Blog » బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు అరెస్ట్…కారణం ఇదే…!

బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు అరెస్ట్…కారణం ఇదే…!

by AJAY
Published: Last Updated on

ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయుని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సరయు సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఛానల్ లో వినాయక చవితి సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను చేశారు. ఈ వీడియో హిందూ మహిళలను అవమాన పరిచేలా ఉంటుందంటూ సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

7 ARTS SARAYU

Advertisement

అయితే ఈ వీడియోను హైదరాబాదులోని ఫిలింనగర్ లో చిత్రీకరించారని తేలింది. ఈ నేపథ్యంలో కేసును హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు దాంతో నేడు సరయును విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా సెవెన్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సరయు ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. జీ తెలుగులో కొన్ని సీరియళ్లలో కూడా నటించారు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ మొదటివారంలోనే ఎలిమినేట్ అయ్యారు.