Home » సంక్రాంతి పోటీ నుంచి త‌ప్పుకున్న ‘7 డేస్ 6 నైట్స్‌’

సంక్రాంతి పోటీ నుంచి త‌ప్పుకున్న ‘7 డేస్ 6 నైట్స్‌’

by Anji
Ad

గ‌త ఏడాది డ‌ర్టీహ‌రి మూవీకోసం చాలాకాలం త‌ర్వాత మెగా ఫోన్ ప‌ట్టుకున్న ప్ర‌ముఖ‌నిర్మాత ఎమ్మెస్ రాజు, ఆ సినిమాకు వివిధ ఫ్లాట్ ఫామ్స్‌లో వ‌చ్చిన స్పంద‌న‌తో వెంట‌నే మ‌రొక చిత్రానికీ శ్రీ‌కారం చుట్టారు. అదే 7డేస్ 6 నైట్స్ మూవీ. దీనిని సుమంత్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వైల్డ్ హ‌నీ ప్రొడ‌క్ష‌న్ పతాకంపై సుమంత్ అశ్విన్‌, ఎస్‌. ర‌జ‌నీకాంత్ నిర్మించారు. వింటేజ్ పిక్చ‌ర్స్, ఏబీజీ క్రియేష‌న్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగ‌స్వాములు.

ms raju

Advertisement

Advertisement

బ్యాచ్‌ల‌ర్ ట్రిప్ కోసం గోవాకు వెళ్లిన ఇద్ద‌రు యువ‌కులు ఇద్ద‌రు యువ‌తుల చుట్టూ జ‌రిగే క‌థ‌తో ఈ సినిమాను ఎం.ఎస్‌.రాజు తెర‌కెక్కించారు. నూత‌న న‌టీన‌టుల‌తో పాటు సుమంత్ అశ్విన్ సైతం ఇందులో న‌టించాడు. స‌మ‌ర్థ్ గొల్ల‌పూడి సంగీతం స‌మ‌కూర్చిన ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని ఎం.ఎస్‌.రాజు భావించారు. కానీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌డంతో ఈ స‌మ‌యంలో ఇప్పుడు ఆలోచ‌న‌ను విర‌మించుకున్నారు. వీలు చూసుకుని త‌మ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం అని ప్ర‌క‌టించారు.

Visitors Are Also Reading