Home » ఇదేమి మ్యాచ్ సామీ.. టాయిలెట్ కి వెళ్లి వచ్చేసరికి ఆల్ అవుట్ అయిపోయారా?

ఇదేమి మ్యాచ్ సామీ.. టాయిలెట్ కి వెళ్లి వచ్చేసరికి ఆల్ అవుట్ అయిపోయారా?

by Srilakshmi Bharathi
Ad

రీసెంట్ గా జరిగిన మ్యాచ్ తో సొంత దేశం అభిమానులే టీం ఇండియా జట్టు ఆటగాళ్ల ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్సేనా లేక గల్లీ ఆటగాళ్లా? అంటూ ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో రెండవ టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ లో టీం ఇండియా ఆటగాళ్లు 153 పరుగులకే ఆల్ ఔట్ అయ్యారు. చివరి ఆరు వికెట్లు అయితే.. అసలు ఒక్క పరుగు కూడా చెయ్యకుండానే అవుట్ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఏడుగురు బ్యాటర్లు కనీసం అకౌంట్ తెరవలేదు.

Advertisement

మొత్తం ఆరుగురు ఆటగాళ్లు డకౌట్ అవ్వడం క్రికెట్ అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మ్యాచ్ మొదలైన సమయంలో టీం ఇండియా పటిష్టంగానే కనిపించింది. 153/4 స్కోర్‌తో గట్టిగానే ఫైట్ చేసింది. కానీ.. ఆట ఎదో మంత్రం వేసినట్లు అక్కడితోనే ఆగిపోయింది. ఆ తరువాత ఫీల్డ్ లోకి వచ్చిన ఒక్క ప్లేయర్ కూడా ఖాతా తెరవలేదు. ఆరుగురు ఆటగాళ్లూ డక్ అవుట్ అయ్యారు. ఈ చెత్త ఫీట్ టెస్ట్ సిరీస్ లో సాధించినట్లు టీం ఇండియాకు చెత్త రికార్డు వచ్చి చేరింది.

Advertisement

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 46 కొట్టగా.. శుభ్‌మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లతో) 36 మాత్రమే కొట్టగలిగాడు. రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లతో) 39 స్కోర్ చేయగా.. రాహుల్ (8) ఖాతా మాత్రం తెరిచాడు. మిగిలిన ఆటగాళ్లంతా డక్ అవుట్ అయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రా(0), మహమ్మద్ సిరాజ్(0), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా(0), ప్రసిధ్ కృష్ణ(0) డక్ అవుట్ అయ్యారు. ఇక ముఖేష్ కుమార్‌ కి అసలు బ్యాటింగ్ చేయడానికి కూడా అవకాశం రాలేదు. భారత ఆటగాళ్లు ఇంత పేలవంగా ప్రదర్శన ఇవ్వడంతో టీం ఇండియా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లీ క్రికెటర్స్ కనీసం ఒక్క పరుగు అయినా చేస్తారని.. వీరు ఏమీ చేయలేదు ఏమిటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading