Home » శ‌ని మిమ్మ‌ల్ని చిన్న చూపు చూస్తున్నాడ‌ని చెప్పే 6 సంకేతాలు.. త‌ప్పించుకోవ‌డానికి మార్గాలు ఇవే..!

శ‌ని మిమ్మ‌ల్ని చిన్న చూపు చూస్తున్నాడ‌ని చెప్పే 6 సంకేతాలు.. త‌ప్పించుకోవ‌డానికి మార్గాలు ఇవే..!

by Anji
Ad

జ్యోతిష్య‌శాస్త్రం ప్ర‌కారం.. శ‌ని ని న్యాయ దేవుడిగా ప‌రిగ‌ణిస్తారు. శ‌ని దేవుడు క‌ర్మ‌ల ఆధారంగా శుభ‌, అశుభ ఫ‌లితాల‌ను ఇస్తాడు. శ‌నిదేవుని వ‌క్ర దృష్టితో ఏ వ్య‌క్తినైనా చెడు కాలం ప్రారంభం అవుతుంద‌ని చెబుతుంటారు. గ్ర‌హాల మార్పు వ‌ల్ల మ‌నిషి జీవితం కూడా ప్ర‌భావిత‌మ‌వుతుంది. జాత‌కంలో శ‌నిస్థానం మారిన‌ప్పుడు ప్ర‌తికూల, అనుకూల ఫ‌లితాలు ల‌భిస్తాయి. శ‌ని గ్ర‌హం మొత్తం రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ఏడున్న‌ర సంవ‌త్స‌రాలు ఉంటుంది. శ‌ని అశుభంగా ఉన్న‌ప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


శ‌ని అశుభ సంకేతాలు : 

Advertisement

అక‌స్మిక ఆర్థిక న‌ష్టంతో పాటు వ్యాపారంలో స్థిర‌మైన క్షీణ‌త‌. ఇది శ‌ని అశుభ ఫ‌లితాల సంకేతంగా అర్థం చేసుకోండి. శ‌నిగ్ర‌హం అశుభ ప్ర‌భావం వ‌ల్ల మ‌నిషి పనికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కార‌ణం లేకుండానే ప‌నిలో అనేక స‌మ‌స్యలు మొద‌ల‌వుతాయి. అటువంటి ప‌రిస్థితిలో వ్య‌క్తి త‌న ఉద్యోగాన్ని కోల్పోయే అవ‌కాశం కూడా ఉంటుంది.


శ‌నిగ్ర‌హం ఆగ్ర‌హించ‌డం ప్రారంభించిన‌ప్పుడు వ్య‌క్తి మోసంలో చిక్కుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ప‌రువు, గౌర‌వం దిగ‌జార‌డంతో పాటు మ‌న‌స్సు చంచ‌లంగా మార‌డం ప్రారంభ‌మ‌వుతుంది. శ‌ని కోసం పెర‌గ‌డం మొద‌లైతే.. చెడు అల‌వాట్లు, దొంగ‌త‌నం, జూదం, బెట్టింగ్ వంటి దుర్గుణాల ప‌ట్ల ఆక‌ర్షితులైతే అది శ‌ని అశుభ ప్ర‌భావానికి సంకేతం అని అర్థం చేసుకోవాలి.

Advertisement

ముఖ్యంగా శ‌ని మూలంగా పేద‌రికం మొద‌ల‌వుతుంది. అటువంటి ప‌రిస్థితిలో దురాశ పెర‌గ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. వ్య‌క్తి భ‌క్తి హీనుడు అవుతాడు. అత‌నికి మ‌త‌ప‌ర‌మైన ప‌ని చేయాల‌ని అనిపించ‌దు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా, శ‌ని ప‌ట్టి పీడిస్తున్న‌ప్పుడు ఒక వ్య‌క్తి నుదురు తేజ‌స్సు లేకుండా త‌గ్గ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. న‌లుపు రంగు కూడా క‌నిపిస్తుంది. ఒక వ్య‌క్తిని కుక్క క‌రిచినా లేదా జంతువుల దాడి వ‌ల్ల మీరు తీవ్రంగా గాయ‌ప‌డినా అది శ‌నిగ్ర‌హంఅశుభ ప్ర‌భావానికి సంకేతంగా ప‌రిగ‌ణిస్తారు.


శ‌ని మ‌హాద‌శ నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప‌రిహారాలు శ‌ని శ్రేయ‌స్సు పొంద‌డానికి అమ‌వాస్య రోజు ప‌విత్ర న‌దిలో స్నానం చేసి పేద‌ల‌కు వారి శ‌క్తికి త‌గ్గ‌ట్టు బ‌ట్ట‌లు, ఆహారాన్ని దానం చేయండి. అదేవిధంగా శ‌నివారం రోజు అశ్వ‌థ వృక్షానికి నీటిని నైవేద్యంగా పెట్ట‌డం వ‌ల్ల కూడా శ‌ని గ్ర‌హం యొక్క దోషం త్వ‌ర‌గా పోతుంది.

శ‌ని అశుభాల‌ను త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌తి శ‌నివారం శ‌ని దేవుడికి ఆవ‌నూనె స‌మ‌ర్పించండి. అదేవిధంగా ఆవ‌నూనె దీపం వెలిగించి శ‌ని చాలీసా ప‌ఠించండి. శ‌ని వారాల్లో ఇనుప వ‌స్తువులు, న‌ల్ల‌ని వ‌స్త్రాలు, ప‌ప్పు ఆవ‌నూనె, పాదుక‌లు త‌దిత‌ర వాటిని దానం చేయ‌డం వ‌ల్ల శ‌ని దేవుడు ప్ర‌స‌న్నుడ‌వుతాడు.

Also Read : 

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Visitors Are Also Reading