Home » కమల్ హాసన్ “విక్రమ్” సినిమా సూపర్ హిట్ అవ్వడానికి 5 కారణాలు ఇవేనా…!

కమల్ హాసన్ “విక్రమ్” సినిమా సూపర్ హిట్ అవ్వడానికి 5 కారణాలు ఇవేనా…!

by AJAY
Ad

కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రం విక్రమ్. ఈ సినిమా జూన్ 3న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు మరియు ఇతర భాషల్లో విడుదల చేశారు. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ముఖ్యంగా ఐదు కారణాలు ఉన్నాయి.

Advertisement

ఈ చిత్రంలో కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటించాడు. విజయ్ సేతుపతి, హీరో సూర్య, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్లు కూడా ముఖ్యమైన పాత్రలో నటించడం వల్ల ముందు నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో సినిమాకు ఫస్ట్ డే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు వెళ్ళారు. అదేవిధంగా లోకేష్ కనకరాజ్ సినిమాలలో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది.

Advertisement

చాలా మంది ప్రేక్షకులు ఆ స్టైల్ ను ఇష్టపడుతున్నారు. మరోవైపు కమల్ హాసన్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. చాలా కాలం నుండి కమల్ హాసన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మరోసారి నట విశ్వరూపం చూపి సినిమా విజయంలో భాగమయ్యారు.

అంతే కాకుండా సినిమా కథ, స్క్రీన్ ప్లే రెండూ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఖైదీ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని లోకేష్ కనకరాజ్ విక్రమ్ సినిమాను తెరకెక్కించారు. అలా చేసినప్పుడు అంచనాలను రీచ్ అవ్వడం చాలా కష్టం…. కానీ లోకేష్ ఆ అంచనాలను రీచ్ అవటంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Also read : బయోపిక్ కు డబ్బులు ఇస్తామన్న “మేజర్” నిర్మాతలు….సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి ఏమన్నారో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..!

Visitors Are Also Reading