తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోగా ఎవరైనా ఉన్నారు అంటే మనకు గుర్తుకు వచ్చేది కృష్ణంరాజు.. రాజుల వంశానికి చెందిన కృష్ణంరాజు పూర్వకాలం నుంచి సంపన్నుడే. ఆయన సినిమాల్లోకి రావడానికి కష్టపడింది అంటూ ఏమీ లేదు కానీ ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. రెబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. దాదాపు 183 చిత్రాలు చేసి తిరుగులేని అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే కృష్ణంరాజు రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించేవారు. ఇప్పటికే పలుమార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇంతటి మంచి మనసున్న మహారాజుకు కోరికలు తీరకుండానే ప్రాణాలు విడిచారు.. మరి ఇంతకీ కృష్ణం రాజు కోరిక ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..
ALSO READ:చిరంజీవికి కృష్ణంరాజు ఇచ్చిన అత్యంత ఖరీదైన బహుమతి ఏంటో తెలుసా..?
కృష్ణంరాజు తన జీవితంలో అన్నీ చూసేసారు. నటుడిగా రాజకీయ నాయకుడిగా నిర్మాతగా, విలన్ గా, సైడ్ క్యారెక్టర్ ఇలా ఆయన చేయలేనిదంటూ లేదు. కానీ ఆయనకు కొన్ని కోరికలు తీరలేదు అయితే “భక్త కన్నప్ప” సినిమా ప్రభాస్ తో తీద్దామనుకున్నాడట. స్క్రిప్ట్ కూడా రెడీ చేసారట. ఆయన దర్శకత్వం వహించి నిర్మించాలన్నది ఆశ. కానీ అది తీరలేదు. అలాగే ఒక్క అడుగు పేరుతో ఒక కథను తయారు చేశారు. ఐదుగురు మల్టీస్టారర్ లతో ఈ సినిమా చేద్దామనుకున్నరట. ఇందులో ప్రభాస్ కూడా స్థానం ఉంది. అలాగే ఈ కథ కోసం చాలామంది పెద్దపెద్ద రచయితలతో సంప్రదింపులు కూడా జరిగాయట. కానీ ఈ కోరిక కూడా తీరలేదు. అలాగే కృష్ణంరాజుకి గవర్నర్ గా పని చేయాలనే కోరిక కూడా ఉండేదట.
ఆ మధ్య ఆయనను గవర్నర్ గా నియమించాలని వార్తలు కూడా ఎక్కువ వచ్చాయి. ఒకానొక సమయంలో ఆయన గవర్నర్ అయ్యారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ కోరిక కూడా తినలేదు. విశాలనేత్రాలు అనే నవల అంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టం, ఆ నవలను సినిమాగా తీయాలని అనుకున్నారు. అదికూడా కుదరలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి చేయాలని ఆయన చాలా ఆశ పడ్డారు. కానీ అది కూడా తీరకముందే కన్నుమూశారు.
ALSO READ:బ్రిటన్ రాజవంశం రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణం అదేనా..?