క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఐపిఎల్ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. మామూలుగా ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యి జూన్ వరకు సాగే ఈ లీగ్ వచ్చే ఏడాది మాత్రం మార్చిలోనే ప్రారంభం కానుంది. దాంతో మినీ వేలంలో ఎవరు ఎంత ధరకు, ఎవరు ఏ టీంకు వెళ్తారు అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ఈ నెల 19న మినీ వేలం దుబాయిలో గ్రాండ్ గా జరపనున్నారు. ఈ మినీవేలంలో 1,116 మంది ప్లేయర్స్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వారిలో తమకు కావలసిన ప్లేయర్స్ కోసం ఐపీఎల్ జట్లు కోట్లు కుమ్మరించడానికి రెడీ అయ్యాయి. ఈసారి మినీ వేలంలో ఒక ప్లేయర్ కోసం జట్లు పోటీ పడే ఛాన్స్ ఉంది.
వరల్డ్ కప్ ఫైనల్లో భారీ సెంచరీ కొట్టిన ఆసీస్ ను ఛాంపియన్ గా నిలిపాడు ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్. అతను ఈసారి ఐపీఎల్ కోసం తన పేరును నమోదు చేసుకున్నాడు. ఓపెనర్ గా ఆడే ఈ ప్లేయర్ కోసం ఐపీఎల్ జట్టు భారీ ధరకు కొనుగోలు చేయడానికి రెడీ అయ్యాయి. దాంతో మినీ వేలంలో ట్రావిస్ హెడ్ కోసం కోట్లు ఖర్చు పెట్టడం ఖాయం. ఈ ఆసిస్ ఓపెనర్ కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఎక్కువగా పోటీ పడుతున్నాయి. వాటితో పాటు ఆసిస్ ప్లేయర్ ను ఎక్కువగా కొనుగోలు చేసే సన్ రైజర్స్ కూడా పోటీలో ఉంది. మరి ఈ స్టార్ ఆటగాడిని ఏ జట్టు ఎంత ధరకు కొనుగోలు చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.
Advertisement
Advertisement
ఇక ఈసారి ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించే ప్లాన్ చేస్తుంది బీసీసీఐ. వచ్చే ఏడాది ఇండియాలో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉన్నాయి. కావున ఐపీఎల్ ప్లేయర్స్ కు భద్రత ఇవ్వడం కుదరదు. అందుకే పరిస్థితులను బట్టి ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించే ఛాన్స్ కూడా ఉంది. గతంలో కూడా కొన్నిసార్లు ఐపీఎల్ ను విదేశాల్లో నిర్వహించారు. మరి 2024 ఐపీఎల్ ను ఇండియాలో నిర్వహిస్తారా? లేదా వేరే దేశాల్లో నిర్వహిస్తారా? అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఈసారి 80కి పైగా మ్యాచ్ లను జరపడానికి ఐపీఎల్ పాలకమండలి రెడీ అవుతుంది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.