Home » ఐపీఎల్ 2011 – 2022 మధ్య ఉన్న పోలికలు ఇవే..!

ఐపీఎల్ 2011 – 2022 మధ్య ఉన్న పోలికలు ఇవే..!

by Azhar
Published: Last Updated on
Ad

బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ప్రతి సీజన్ కు ఈ లీగ్ లో చాలా మార్పులు వస్తాయి. ఇక గత ఐపీఎల్ 2011 తర్వాత అప్పటికి.. ఇప్పటికి ఇంకా ఎక్కువ మార్పులే వచ్చాయి. కానీ ఐపీఎల్ 2011 – 22 మధ్య ఉన్న పోలికలు ఏంటో మీకు తెలుసా..? రండి చూద్దాం..!

అయితే ఐపీఎల్ 2022 లో రెండు కొత్త జట్లు వచ్చిన విషయం తెలిసిందే. లక్నో, గుజరాత్ పేరిట ఆ జట్టుకు వచ్చాయి. ఇక ఐపీఎల్ 2011 లో కూడా ఇలాగె రెండు కొత్త జట్లు వచ్చాయి. పూణే వారియర్స్. కొచ్చి టస్కర్స్ పేరిట ఆ జట్లు ఎంట్రీ ఇచ్చాయి.

Advertisement

ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2010 లో మొదటిసారి టైటిల్ గెలిచి.. 2011 సీజన్ కు డిఫెండింగ్ ఛాంపియన్‌గా వచ్చింది. అయితే ఇప్పుడు కూడా 2021 ఐపీఎల్ టైటిల్ గెలిచినా అదే ధోని జట్టు 2022 సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది.

ఇక ఐపీఎల్ 2011వ సీజన్ ఏ రెండు జట్ల మధ్య పోటీతో ప్రారంభమైందో.. ఈ ఐపీఎల్ 2022 కూడా అవే రెండు జట్లు అయిన చెన్నై, కోల్కతా మధ్య మ్యాచ్ తో మొదలైంది.

Advertisement

2011 సీజన్ లో హైదరాబాద్ జట్టును డెక్కన్ ఛార్జర్స్ అని పిలిచేవారు. అప్పుడు 2011 ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఓడిపోయిన శ్రీలంక జట్టును నడిపిన కుమార సంగక్కర హైదరాబాద్ కెప్టెన్ ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే విధంగా ఆఖరి వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్స్ లో ఓడి రన్నరప్ గా ఉన్న న్యూజిలాండ్ జట్టును నడిపిన కేన్ విలియమ్సన్.. ఇప్పటి హైదరాబాద్ జట్టు అయిన సన్ రైజర్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు.

ఐపీఎల్ లో మొదటి మూడు సీజన్లలో దారుణంగా ఓడిన కోల్కతా జట్టు 2011 సీజన్ లో గంభీర్ ను తమ కెప్టెన్ గా ఎంచుకుంది. అప్పుడు అతను ఢిల్లీ జట్టు నుండి వచ్చాడు. ఈ ఐపీఎల్ 2022 లో కూడా కేకేఆర్ కు కొత్త కెప్టెన్ గా వ్యవరిస్తున్న శ్రేయాస్ అయ్యర్ కూడా అదే విధంగా ఢిల్లీ జట్టునుండే వచ్చాడు.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ కు బంపర్ ఆఫర్.. టీం ఇండియాలోకి ఎంట్రీ..?

పాస్ లేకపోతే కోహ్లీలాగే ఫేస్ పెడతారు…!

Visitors Are Also Reading