Telugu News » ఆర్ఆర్ఆర్‌లో న‌టించిన హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ గురించి 5 ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

ఆర్ఆర్ఆర్‌లో న‌టించిన హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ గురించి 5 ర‌హ‌స్యాలు మీకు తెలుసా..?

by Anji
Ad

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి కారణమైన వ్యక్తులలో అజయ్ దేవగన్ ఒకరనే సంగతి తెలిసిందే. సినిమాలో అజయ్ దేవగణ్‌ పాత్ర అ నిడివి తక్కువైనా అజయ్ తన నటనతో ఈ సినిమా సక్సెస్ సాధించడానికి కారణమయ్యారు. ఇవాళ‌ అజయ్ దేవగన్ పుట్టిన రోజు కావడం విశేషం. అజయ్ దేవగణ్‌ నటించిన రన్ వే 34 ఈనెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అజయ్ 53వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.


బాలీవుడ్ టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అజయ్ దేవగణ్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అజయ్ దేవగన్ అభిమానులలో కూడా చాలా మందికి అజయ్ దేవగణ్‌ కు సంబంధించిన 5 రహస్యాలు తెలియవు. అజయ్ దేవగన్ శివుని భక్తుడు కాగా ఆయన నటించిన శివాయ్ సినిమాను శివుడికి అంకితం ఇచ్చారు. అజయ్ దేవగణ్‌ ఛాతీపై శివుని పచ్చబొట్టు ఉంటుంది. దేవగన్ ట్రావెల్ లవర్ కావడం గమనార్హం.

Advertisement

Advertisement

ఫ్యామిలీతో కలిసి దూర ప్రయాణాలు చేయడానికి అజయ్ దేవగన్ ఎంతగానో ఇష్టపడతాడు. అజయ్ దేవగన్ తన కుటుంబ సభ్యుల కొరకు అవసరం అయితే ఐలాండ్ ను కూడా బుక్ చేస్తార‌ని తెలుస్తోంది. అజయ్ దేవగన్ అద్భుతంగా వంటలు చేస్తాడు. ఇండియన్ కాంటినెంటల్ డిషెస్ ను అజయ్ అద్భుతంగా కు చేస్తాడని సమాచారం. కొడుకు కూతురు అంటే అజయ్   కు అమితమైన ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా అజయ్ రోజులో కొంత సమయం కూతురు తో మాట్లాడడానికి కేటాయిస్తారు. అజయ్ దేవగణ్‌ చాలా సంవత్సరాలుగా పోలో గ్రీన్ అనే కొలోన్ ను మాత్రమే దర్శిస్తున్నారు. నటుడిగా మరెన్నో విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అజయ్ దేవగన్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read : మిథున్ చక్రవర్తి తో శ్రీదేవి ప్రేమాయణం…ఆ ఒక్క రీజన్ వల్లే బ్రేకప్…!

Visitors Are Also Reading