Home » క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే 5 జెర్సీ నెంబర్లు..!

క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే 5 జెర్సీ నెంబర్లు..!

by Azhar

ఇండియాలో ఎంతో ప్రాముఖ్యత సాధించిన క్రికెట్ లో కొంతమంది ఆటగాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే క్రికెట్ కెరియర్ ప్రారంభించే ముందు ఆటగాళ్లు తమ జెర్సీ వెనుక ఉండే నెంబర్ ను ఏదో ఒక కారణంతో ఎన్నుకుంటారు. కానీ ఆ తర్వాత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో ఆ నెంబర్ కు ఓ ప్రాముఖ్యత వస్తుంది. అలా ప్రస్తుతం ఆకాశానికి చేరుకున్న ఐదు ప్రసిద్ధ జెర్సీ నంబర్లు ఏంటో చూద్దాం.

10 – సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ ను ప్రపంచవ్యాప్త అభిమానులు క్రికెట్ దేవుడు ఐ పిలుస్తుంటారు. దాదాపు పదేళ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికినప్పటికీ ప్రక్కలకు అతని పై అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. 100 సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ జెర్సీ నెంబర్ చిరస్థాయిగా నిలిచింది. భారత యువతి ఆటగాడు శార్దూల ఠాకూర్ కెరియర్ మొదట్లో తన జెర్సీ వెనుక 10 నెంబర్ వేసుకుంటే.. సచిన్ అభిమానులు ఏ రేంజ్ లో రచ్చ చేసారో అందరికి తెలుసు.

7 – MS ధోని

28 ఏళ్ల తర్వాత భారత్‌ ను ప్రపంచ కప్‌ను గెలిపించిన మహేంద్ర సింగ్ ధోనీ భారతీయ అభిమానులందరికీ 7వ నెంబర్ ను ఓ చరిత్రగా మార్చాడు.అత్యుత్తమ వికెట్ కీపర్ మరియు ఆల్ టైమ్ అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకడు ధోని. అయితే ధోని పుట్టిన నెల, తేదీ రెండు 7 కావడంతోనే అతను జెర్సీ నెంబర్ 7 అయ్యిందని అభిమానులు భావిస్తారు.

18 – విరాట్ కోహ్లీ

భారత అండర్-19 జట్టు నుండి సీనియర్ జాతీయ జట్టుకు వచ్చిన విరాట్ కోహ్లి… క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. బౌలర్ల పై పూర్తి ఆధిపత్యంతో కూడిన అతని బ్యాటింగ్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ భారత రన్-మెషిన్ జెర్సీ నంబర్ 18ని ధరిస్తాడు. అయితే కోహ్లీ పై అభిమానంతో కొంతమంది తమ చర్మంపై పచ్చబొట్టుగా ఈ నెంబర్ ను వేసుకుంటారు. 18వ తేదీన కన్నుమూసిన తన తండ్రికి నివాళులర్పిస్తూ ఈ నంబర్‌ను కోహ్లీ ధరిస్తున్నాడు.

17 – AB డివిలియర్స్

మిస్టర్ 360 మరియు ఆల్ టైమ్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన AB డివిలియర్స్ ద్వారా 17 జెర్సీ నెంబర్ 17 కు పిచ్చి క్రేజ్ వచ్చింది. బ్యాట్ తో విధ్వంసం సృష్టించగల డివిలియర్స్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కొన్ని అద్భుత విన్యాసాలు కూడా చేస్తాడు. డివిలియర్స్ అతని పుట్టినరోజు కారణంగా 17వ నెంబర్ జెర్సీ ధరిస్తున్నాడు. అంతేగాక 17ని తన అదృష్ట సంఖ్యగా భావిస్తున్నట్లు మిస్టర్ 360 పేర్కొన్నాడు.

333 – క్రిస్ గేల్

యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ను మించిన టీ20 క్రికెటర్ లేడు. క్రీజులో రెండవ ఆలోచన లేకుండా అతను బాల్ ను చితక బాదేస్తాడు. 41 సంవత్సరాల వయస్సులో కూడా.. అతను టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 14000లకు పైగా టీ20 పరుగులను సాధించిన ఒకే వ్యక్తి గేల్. ఇక గేల్ జెర్సీ నెంబర్ 333. తన అత్యుత్తమ టెస్ట్ స్కోరు 333 కావడంతో గేల్ జెర్సీపైకి ఆ నెంబర్ వచ్చింది.

Visitors Are Also Reading