శని స్థానంలో చిన్న మార్పు ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్నే చూపుతుంది. ఆ తరువాత జూన్ ప్రారంభంలో శని వెనక్కి వెళ్లనున్నది. జూన్ 05, 2022 నుంచి శనిగ్రహం తిరోగమనం చెందుతుంది. దీంతో కొంత మందిని ఇబ్బంది కూడా పెడుతుంది. కొందరికీ అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం శని కుంభరాశిలో ఉన్నాడు. జూన్ 05 నుంచి తిరోగమనం చేయబోతున్న శని వచ్చే అక్టోబర్ 2022 నాటికి ఈ స్థానంలోనే ఉంటాడు. శని బలహీనంగా ఉన్న వ్యక్తులు పలు సమస్యలను ఎదుర్కొంటారు.
వృషభ రాశి :
ఈ రాశి వారికి శని రాశి మారడం కూడా శ్రేయస్కరమనే చెప్పాలి. తిరోగమన శని కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అలాంటి వారికి చాలా మంచి ఉద్యోగం వస్తుంది. ఆదాయంలో గణనీయంగా పెరుగుదల ఉంటుంది. అదే సమయంలో కొంతమందికి ప్రస్తుతం ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. మొత్తానికి కెరీర్ డబ్బు, సంబంధాలకు సంబంధించిన సమస్యలు అధిగమించబడతాయి.
కన్య రాశి :
తిరోగమన శని కన్యరాశి వారి కెరీర్‌లో పురోగతిని ఇస్తుంది. కొత్త ఉద్యోగం, ప్రమోషన్, జీతం పెరిగే అవకాశాలున్నాయి. మీరు ఉద్యోగం మారాలని అనుకుంటే లేదా బదిలీ చేయాలనుకుంటే ఈ సమయంలో ఈ కోరిక కూడా నెరవేరుతుంది.
మకర రాశి :
శని గ్రహం తిరోగమనం మకరరాశి వారికి ప్రతి పనిలో విజయాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు ఇప్పుడు వేగంగా పూర్తి అవుతాయి. కెరీర్‌లో గొప్ప విజయం సాధించవచ్చు. ధనం లాభదాయకంగా ఉంటుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదమనే చెప్పవచ్చు.
Also Read :
కృష్ణ పుట్టిన రోజు వేడుకలకు మహేష్ ఫ్యామిలీ ఎందుకు రాలేదో తెలుసా..?
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆలోచిస్తే పరిష్కార మార్గం లభిస్తుంది