Home » 3rd march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

3rd march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 6,561 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న క‌రోనాతో 142 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం దేశంలో రోజువారీ పాజిటివీ రేటు 0.74 గా ఉంది.

నేడు మూడు‌రాజధానుల చట్టం, సీఆర్డీఏ రద్దు పిటీషన్ లపై ఏపీ హైకోర్ట్ త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే మూడు రాజధానుల చట్టాన్ని, సి ఆర్ డి ఏ చట్ట రద్దు ను ప్ర‌భుత్వం ఉపసంహరించుకున్న సంగ‌తి తెలిసిందే. దాంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెల‌కొంది.

ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు వేగవంతం అయ్యింది. ఇప్పటి వరకు 17 వేల మంది విద్యార్థుల‌ తరలింపు జ‌రిగింది. 24 గంటల్లో 6 విమానాలు భార‌త్ చేరుకున్నాయి. మరో 24 గంటల్లో ఢిల్లీకి 15 ప్రత్యేక విమానాలు వ‌చ్చిన‌ట్టు విదేశాంగ‌శాఖ ప్ర‌క‌టించింది.

ఉక్రెయిన్ లో ర‌ష్యా సైనికుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింద‌ని న్యూయార్క్ టైమ్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ర‌ష్యా సైనికుల్లో ఎక్కువ‌శాతం ఉండ‌టం..వారికి అనుభ‌వం లేక‌పోవ‌డంతో ఆహారం కూడా దొర‌క్క ద‌య‌నీయ స్థితిలో ఉన్నార‌ని క‌థ‌నంలో రాసుకొచ్చింది.

రేప‌టి నుండి మూడు రోజుల పాటూ ద‌క్షిణ కోస్తా రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. మ‌రోవైపు నిన్న కోస్తాలో అధిక ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

నేడు ఏపీకి కేంద్ర‌మంత్రి షెకావ‌త్ వ‌స్తున్నారు. రేపు పోల‌వ‌రం సంద‌ర్శ‌న కోసం ఆయ‌న విచ్చేయ‌నున్నారు. నేడు సీఎం జ‌గ‌న్ ఇచ్చే విందుకు హాజ‌ర‌వుతారు. రేపు సీఎంతో క‌లిసి పోల‌వ‌రంను సంద‌ర్శిస్తారు.

దేశ‌ర‌క్ష‌ణ కోసం ఉక్రెయిన్ క్రీడాకారులు ఆ దేశ సైన్యంలో చేరుతున్నారు. ఉక్రెయిన్ క్రీడాకారుడు దిమిత్రో సైన్యం దుస్తుల్లో క‌నిపించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆరోద‌శ పోలింగ్ కొన‌సాగుతోంది. గోర‌ఖ్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి సీఎం యోగి ఆదిత్యానాథ్ పై స‌మాజ్ వాద్ పార్టీ అభ్య‌ర్థి శుభావ‌తి పోటీచేస్తున్నారు. మొత్తం 57 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ఉక్రెయిన్ ర‌ష్యా యుద్దం నేప‌థ్యంలో చ‌మురు ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర 111 డాల‌ర్ల‌కు చేరుకుంది. దాంతో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.125కు చేరే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

100 మంది భార‌త విద్యార్థుల‌పై పోలండ్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఆ దేశ సైనికులు దాడి చేశారు. దీనికి సంబంధిచిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆ త‌ర‌వాత వారిని మ‌ళ్లీ ఉక్రెయిన్ కు పంపించారు.

Visitors Are Also Reading