Home » 30 ఏళ్ల ముఠామేస్త్రి సినిమా గురించి మీకు తెలియని, నమ్మలేని నిజాలు.. ఏంటంటే..?

30 ఏళ్ల ముఠామేస్త్రి సినిమా గురించి మీకు తెలియని, నమ్మలేని నిజాలు.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే చిరంజీవి మరియు కోదండరామిరెడ్డి కాంబినేషన్ చాలామందికి గుర్తుకొస్తుంది. ఈ కాంబో ఎన్నో సంచలన విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అని చెప్పవచ్చు. ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ లు అందుకున్న కాంబినేషన్ వారిది. అలాంటి హిట్లలో ముఠామేస్త్రి సినిమా కూడా ఒకటి. 1993 జనవరి 17వ తేదీన వచ్చిన ఈ సినిమా సరిగ్గా ఈరోజుతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాంటి ఈ మూవీ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

Advertisement

అభిలాష, ఖైదీ, న్యాయం కావాలి, ఛాలెంజ్,విజేత, పసివాడి ప్రాణం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చాయి. వీరి కాంబోలో 1993 లో వచ్చిన ముఠామేస్త్రి సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగి దుర్మార్గుల ఆట కట్టించడం కోసం మళ్లీ కూలిగా మారే బోసు పాత్రలో చిరంజీవి అదరగొట్టేసారు. వీటికి తోడు పాటలు,డాన్సులు మరో లెవల్ అని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా చూడడం కోసం థియేటర్లకు భారీ ఎత్తున జనాలు క్యూ కట్టారంటే ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

రికార్డు స్థాయిలో వసూలు చేసిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కే శేఖర్ బాబు డి శివ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన ఈ మూవీలో రోజా, మీనా,రత్ సక్సేనా మున్సూర్ అలీ ఖాన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు లు ముఖ్య పాత్రల్లో నటించారు. పరుచూరి సోదరులు సంభాషణలు అందించగా ఈ చిత్రానికి ఎస్ గోపాల్ రెడ్డి సినిమా ఆటోగ్రాఫర్ గా చేసారు. ఈ సినిమాలో మీ పేటకు నేనే మేస్త్రి, ఆంజనీ పుత్రుడా వీరాది వీరుడా వంటి పాటలు ఎంతో ప్రజాధారణ పొందాయి.

also read:

Visitors Are Also Reading