Home » ఆఖరి బంతికి 3 పరుగులు.. బౌండరీ లైన్ లో ఉత్కంఠ.. చివరికీ ఏం జరిగిందంటే..?

ఆఖరి బంతికి 3 పరుగులు.. బౌండరీ లైన్ లో ఉత్కంఠ.. చివరికీ ఏం జరిగిందంటే..?

by Anji
Ad

ఇంగ్లండ్ లో జరుగుతున్న టీ-20లో బ్లాస్ట్ లీగ్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సర్రే, ఎసెక్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సర్రేకు సునీల్ నరైన్ తుఫాన్ ఇన్నింగ్స్ తో అదురగొట్టాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన నరైన్ తుఫాన్ ఇన్నింగ్స్ తో అదురగొట్టాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ చేసిన నరైన్ కేవలం 37 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ అజేయ అర్థ సెంచరీతో సర్రే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

Advertisement

దాదాపు 196 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన ఎసెక్స్ జట్టులో డేనియల్ లారెన్స్ 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇక ఆ తరువాత వచ్చిన కైల్ పెప్పర్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనతో బౌలర్లను చిత్తు చేసాడు. వేగంగా బ్యాటింగ్ చేసిన పెప్పర్ 39 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 75 పరుగులతో విధ్వంసం చేసాడు. మరోవైపు ఫిరోజ్ ఖుషి కూడా అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచాడు. దీని ఫలితంగా చివరి ఓవర్ లో ఎసెక్స్ జట్టు విజయానికి 8 పరుగులు కావాల్సి వచ్చింది. తొలి 5 బంతుల్లో ఒక్కో పరుగు వచ్చింది. దీంతో ఎసెక్స్ టీమ్ చివరి బంతికి 3 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో షాన్ అబాట్ వేసిన చివరి బంతిని డీప్ మిడ్ వికెట్ కి తరలించిన ఫిరోజ్ ఖుషీ.. సిక్స్ లేదా ఫోర్ పోతుందనుకున్నాడు. 

Advertisement

కానీ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్ జోర్డాన్ వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని క్యాచ్ పట్టుకున్నాడు. అదేవేగంతో బౌండరీ లైన్ దాటాడు. ఈ తరుణంలోనే బంతిని గ్రౌండ్ లోకి విసిరేందుకు ప్రయత్నించాడు. కానీ స్పీడ్ కంట్రోల్ చేేసే తరుణంలో బంతిని మైదానంలోకి విసరలేకపోయాడు. జోర్డాన్ తో పాటు బంతిని కూడా బౌండరీ దాటింది. చివరి బంతికి వికెట్ పడాల్సిన చోట ఎసెక్స్ జట్టు ఉత్కంఠగా విజయం సాధించింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సూర్యకుమార్ యాదవ్ గురించి డివిలియర్స్ ఏమన్నాడో తెలుసా ? 

23 బంతుల్లో బీభత్సం సృష్టించిన పంజాబ్ ప్లేయర్.. ఆల్ రౌండ్ షో అదుర్స్..!

Visitors Are Also Reading