Home » Govt:వడ్డీ లేకుండా 3 లక్షల లోన్..50% సబ్సిడీ.. ఎలా పొందాలంటే..?

Govt:వడ్డీ లేకుండా 3 లక్షల లోన్..50% సబ్సిడీ.. ఎలా పొందాలంటే..?

Ad

ప్రస్తుత కాలంలో చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక వ్యాపారాలు చేయాలని ఆలోచనతో ఉంటున్నారు. ఇందులో చాలామంది ప్రభుత్వం నుంచి ఏదైనా లోన్ లభిస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. లోన్ లభిస్తే వ్యాపారాలు మొదలుపెట్టాలని ఆశగా ఉన్న వారికి గుడ్ న్యూస్. ఎలాంటి వడ్డీ లేకుండా మూడు లక్షల లోన్ పొందవచ్చు. పైగా సగం లోన్ కడితే సరిపోతుంది.. మరి దాని వివరాలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం..

also read:రెబల్ స్టార్ ప్రభాస్ లాగే మరో వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా ? అతను కూడా నటుడే..!

Advertisement

ఈ లోన్ పథకాన్ని 2020లో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇది అందరికీ ఇచ్చే లోన్ కాదు. దీనికి కేవలం స్త్రీలకు మాత్రమే ఇస్తారు. ఈ పథకం పేరే ఉద్యోగిని. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నవారు దీనిని డెవలప్ చేసుకునేందుకు కొత్తగా వ్యాపారం చేసే ఆలోచన ఉన్నవారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం మీరు దగ్గర్లో ఉన్న ఏ బ్యాంకుకైనా వెళ్లి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి హామీ చూపించాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ గా మూడు లక్షల వరకు రుణం లభిస్తుంది..

Advertisement

also read:Mokshagna : బాలయ్య పుత్రుడి ఎంట్రీకి స్క్రిప్ట్ రెడీ….టైటిల్ కూడా ఇదేనట…!

అర్హతలు:
ఈ పథకానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. ముఖ్యంగా వీరికి 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు ఉండాలి. వారికి అప్పటికే ఏదైనా వ్యాపారం ఉండాలి. లేదంటే వ్యాపారం చేయాలని ఆలోచన ప్రణాళిక ఉండాలి. ఇందులో 88 రకాల వ్యాపారాల లోన్లు పొందవచ్చు. ఈ లోన్ కోసం మీరు ఒక ఆరు రోజులు ఎంటర్ పెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఇది పూర్తి చేస్తేనే ఈ లోన్ ఇస్తారు. పైగా మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. గతంలో ఏవైనా లోన్స్ తీసుకొని ఎగవేసిన వారు అనర్హులు.

also read:Anushka Shetty: ప్రభాస్ ను ప్రేమగా పిలిచిన అనుష్క….ఫైర్ అవుతున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్..!

Visitors Are Also Reading