Home » 27th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

27th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తిరుపతిలోని బాకరాపేట ఘాట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్‌ బస్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డింది. ఈ ప్ర‌మాదంలో డ్రైవర్‌తో సహా ఏడుగురు మృతి చెందార‌. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్న‌ట్టు స‌మాచారం.

ఐపీఎల్-15 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది.

Advertisement

చైనా సరిహద్దుల్లో భారత సైన్యం సైనిక విన్యాసాలను నిర్వహించింది. శిలిగుడి ప్రాంతంలో నిర్వహించిన విన్యాసాల‌లో 600 మంది సైనికులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పారాషూట్ ల ద్వారా సైనికులు పై నుండి దూకడం శత్రువుల స్థావ‌రాల‌న‌ను దాటి కీలక ప్రాంతాలను ఆక్రమించ‌డం లాంటి విన్యాసాలను చేశారు.

Ap cm jagan

Ap cm jagan

ఏపీలో కొత్త జిల్లాల‌ల పై వారం రోజుల్లో తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల‌ కేంద్రాల్లో అధికారులు కార్యాలయాలను గుర్తించారు. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలను సీఎం జగన్ ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాలకు కలెక్టర్ లను కూడా నియ‌మింబోతున్నారు.

Advertisement

ఆదాయ మార్గాలను పెంచుకునే దిశగా ఏపీఎస్ ఆర్టీసీ అడుగులు వేస్తోంది. దానికోసం ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వాహనాల సర్వీసింగ్ సెంటర్లు గా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది.

దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వరుసగా ఆరు రోజుల్లో ఐదు సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్ పై లీటర్ కు 50 పైసలు, డీజిల్ పై లీటర్ కు 50 పైసలు చొప్పున పెరిగాయి. దాంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.21 కి చేరుకుంది. డీజిల్ ధర లీటర్ కు రూ.98.58 కు చేరుకుంది.

పేదలందరికీ ఇల్లు క‌ట్టిస్తున్న ఏపీ స‌ర్కార్ లబ్ధిదారులు శంకుస్థాపన చేసి మట్టి పనులు పూర్తి చేసుకున్న వెంటనే 15 వేల చొప్పున ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు బేస్మెంట్ పూర్తయ్యాక మొదటి బిల్లు రూపంలో 60,000 ల‌ను ఇస్తోంది. అయితే ఆ సమయం వరకు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Visitors Are Also Reading