Home » 21st march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

21st march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

భార‌త్ లో గ‌డిచిన 24గంట‌ల్లో 1,549 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 31 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ నేప‌థ్యంలో సమ్మె బాటలో స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఉన్నారు. ఈ నెల 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్టు కార్మికులు నోటీసు పంపించారు.

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్వోదయ పాదయాత్ర ప్రారంభించారు. మీనాక్షి నటరాజన్‌తో కలిసి పాదయాత్రలో జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. భూదాన్‌ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర వార్ధా వరకు పాదయాత్ర నిర్వ‌హించ‌నున్నారు.

రాష్ట్రంలో సరఫరా అవుతోన్న మద్యం నాసిరకంగా ఉంద‌ని టీడీపీ ఆరోపిస్తుంది. మ‌ద్యం ప్రాణాంతకంగా మారుతుంద‌నే అంశంపై చర్చ కోరుతూ అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం చేసింది.

cm kcr

cm kcr

హైద‌రాబాద్ లో నేడు సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌తన టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం జ‌రుగుతోంది.

Advertisement

ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాక వెల్ల‌డించింది. కోస్తా, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది.

నేడు బోధన్‌ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. కాగా అనుమతి లేదని అడిషనల్‌ డీజీ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేసారు. ఎవరూ షాపులు మూసియేవద్దని డీజీపీ నాగిరెడ్డి ఆదేశాలు జారీచేశారు.

పిఠాపురంలో మ‌న్సిప‌ల్ అధికారులు వ‌డ్డీ వ్యాపారుల కంటే దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. ఇంట్లో మ‌నుషులు ఉండ‌గానే ప‌న్నుక‌ట్ట‌లేద‌నే కార‌ణంగా ఇంటికి తాళం వేశారు. గొడ‌వ చేయ‌డంతో ఓ తాళాన్ని తొల‌గించారు.

ఆర్థోపెడికి స‌ర్జరీల‌ను ఇక‌పై ప్ర‌భుత్వ ఆస్ప‌త్ర‌ల్లోనే చేసుకోవాల‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్ర‌ల్లో స‌ర్జ‌రీకి కావాల్సిన అన్ని వ‌స‌తుల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు.

తెలంగాణ‌లో వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుండి మారాఠీ, ఉర్దూ, క‌న్న‌డ ఇత‌ర భాష‌ల్లో విద్యను అభ్య‌సిస్తున్న 5నుండి 10 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు తెలుగు పార్య‌పుస్త‌కాలు స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. తెలుగు మ‌హాస‌భ‌ల సంధ‌ర్బంగా తెలుగును ఒక సబ్జెక్ట్ గా చెప్పాల‌ని నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading