Home » తెలంగాణలో కొలువుల జాతర.. TSPSC నుంచి మరో 2 జాబ్ నోటిఫికేషన్లు

తెలంగాణలో కొలువుల జాతర.. TSPSC నుంచి మరో 2 జాబ్ నోటిఫికేషన్లు

by Bunty

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కారు. ఇక తాజాగా మరోసారి విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో రెండు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 276 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, రెండు నోటిఫికేషన్స్ లో భాగంగా విద్యాశాఖ, వ్యవసాయ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 37 పిడి పోస్టులు, ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ 91 పీడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక మరో నోటిఫికేషన్ లో భాగంగా వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్-1 లో 100, మల్టీ జోన్ 2 లో 48 ఖాళీలు ఉన్నాయి. వచ్చేనెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటికి సంబంధించిన వివరాలన్నీ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో విడుదల చేయనున్నట్లు టిఎస్పిఎస్సి సెక్రెటరీ అనిత రామచంద్రన్ తెలిపారు.

read also : కొత్త సంవత్సరం వేళ మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. తెలంగాణ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్ !

Visitors Are Also Reading