Telugu News » Blog » వామ్మో.. బంధం కోసం 2 మిలియన్ల భారతీయులు రిజిస్టర్ చేసుకున్నారా..?

వామ్మో.. బంధం కోసం 2 మిలియన్ల భారతీయులు రిజిస్టర్ చేసుకున్నారా..?

by Anji
Ads

సాధారణంగా భారతదేశం అంటే ఎవరైనా గొప్ప దేశం అని చెబుతుంటారు. భారతదేశంలో విభిన్న మతాలు ఉన్నప్పటికీ అంతా కలిసి మెలిసి జీవిస్తున్నారు. దేశంలో ఎన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నప్పటికీ అన్నింటిని పాటిస్తూ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రాన్స్ లో జరిగిన సంఘటన మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్రాన్స్ కి చెందిన వివాహేతర సంబంధాలకు చెందిన ఎక్స్ ట్రా మారిటల్ డేటింగ్ యాప్ గ్లీడెన్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

Advertisement

ఇది వాస్తవానికి ఆశ్చర్యకరమనే చెప్పాలి. తమకు పెళ్లి అయినప్పటికీ.. ఇతరుల పట్ల వ్యామోహంతో స్త్రీ, పురుషులు ఇరువురు రెచ్చిపోతున్నారు. కొత్త బంధం ఏ మాత్రం అవకాశం వచ్చినా వదలడం లేదు.గ్లీడెన్ యాప్ సబ్ స్క్రైబర్స్ దాదాపు 10 మిలియన్ల మార్క్ దాటిందట. అందులో వింత ఏముందని మీరు సందేహ పడవచ్చు. కానీ ఆ 10 మిలియన్ల మందిలో ఒక్క భారతదేశం నుంచే 2 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉండడం విశేషం. అంతేకాదు.. సెప్టెంబర్ 2022 నుంచి 11 శాతం భారతీయ సబ్ స్క్రైబర్స్ పెరిగినట్టు తెలుస్తోంది. కొత్త సబ్ స్క్రైబర్స్ లలో చాలా మంది టైర్ 1 నగరాల నుంచి వచ్చారని.. మిగిలిన 44 శాతం టైర్ 2, 3 నగరాల నుంచి వస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. భారత్ లో అయితే పెళ్లిని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. వివాహ బంధానికి ఓ అర్థం కూడా ఉంటుంది. కుటుంబ పెద్దలు, బంధు మిత్రుల సమక్షంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ ఒక్కటవుతారు. కాలం మారుతున్నప్పటికీ కొద్ది వివాహ బంధం బీటలు వారుతోంది. వివాహానికి అర్థం లేకుండా పోతుంది. అవాంఛిత కోరికలు, ఇతరుల పట్ల వ్యామోహం, స్త్రీ,పురుషులు ఇద్దరినీ తప్పుడు మార్గంలోకి నెట్టేస్తుంది. గ్లీడెన్ విడుదల చేసిన తాజా ప్రకటన ఇందుకు సరైన ఉదాహరణ అనే చెప్పవచ్చు. 

Advertisement

Also Read :  హైపర్ ఆదికి జారు మిఠాయి తినిపిస్తా అంటూ శ్రీరెడ్డి ఫైర్…వీడియో వైరల్….!

Manam News

ఇక ఈ యాప్ లో భారత సబ్ స్క్రైబర్స్ రోజు రోజుకు పెరుగుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.   దాదాపు 2022లోనే 18 శాతానికి పైగా సబ్ స్క్రైబర్స్ పెరిగినట్టు తెలుస్తోంది. 2021   డిసెంబర్ లో 1.7 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ ఉండగా..  ప్రస్తుతం  2 మిలియన్లకు పైగా చేరుకున్నట్టు యాప్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఈ యాప్  పెళ్లి అయిన వారి కోసమే రూపొందించగా.. వివాహితులు మాత్రమే సబ్ స్క్రైబ్ చేసుకునే అవకాశముంటుంది. భారత్ కి చెందిన స్త్రీ, పురుషులు దాదాపు 2 మిలియన్ల మంది సబ్ స్క్రైబ్ చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. వీరిలో అధికంగా ధనవంతులు, ఉన్నత ఉద్యోగులు ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. ఇక వీరి వయస్సు విషయానికొస్తే.. పురుషుల్లో 30 ఏళ్ల దాటిన వారు, మహిళలు 26 ఏళ్లు దాటిన వారే అధికంగా ఉన్నారట. ప్రధానంగా ఈ యాప్ మహిళల భద్రతకు ప్రియారిటీ ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ యాప్ లో 60 శాతం మంది పురుషులు, 40 శాతం మంది మహిళా వినియోగదారులుంటారని కంపెనీ వెల్లడించింది. 

Advertisement

Also Read :  కరోనా వ్యాక్సిన్లతో చాలా సైడ్ ఎఫెక్ట్స్.. విస్తుపోయే విషయాలు వెల్లడించిన కేంద్రం..!