ఒకే కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకోవడం కంటే ఇతర కులాల వారిని పెళ్లి చేసుకోవడం వల్ల పుట్టబోయే సంతానం ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అంతే కాకుండా ఇతర కులాల వారిని పెళ్లి చేసుకోవడం వల్ల కుల రహితం సమాజం నిర్మితమవుతుంది. అయితే కులాంతర వివాహాలను ప్రభుత్వాలు మరియు ఇతర సంస్థలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం ఓ పథకాన్ని సైతం తీసుకువచ్చింది.
Advertisement
కులాంతర వివాహం చేసుకున్నవారికి రూ.2.5లక్షల నగదును అందజేయనుంది. ఈ పథకంను డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. 2013లో సామాజిక అసమానతలు తొలగించాలనే ఉద్దేశ్యేంతో ఈ పథకాన్నీ తీసుకువచ్చారు. దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలను లేదా అబ్బాయిలను వివాహం చేసుకుంటే కేంద్రం రెండు విడతలుగా డబ్బును ఖాతాలో జమచేయనుంది.
Advertisement
ఈ పథకాన్ని అన్ని రాష్ట్రప్రభుత్వాలతో కలిసి కేంద్రం అమలు చేస్తుంది. ఈ పథకానికి 18 ఏళ్లు నిండిన వాళ్లు అర్హులు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి వివాహం జరిగినట్టు పత్రాలు ఉండాలి. పథకానికి అప్లై చేసుకునేవాళ్లు తమ ఆధారకార్డులను సమర్పించాలి. అంతే కాకుండా కుల దృవీకరణ పత్రాలను సైతం సమర్పించాల్సి ఉంటుంది. ఏపీలో మరియు తెలంగాణ లో అధికారిక వెబ్ సైట్ ల ద్వారా పథాకానికి ధరకాస్తు చేసుకోవాలి. జంటలో ఖచ్చితంగా ఒకరు దళితులు అయి ఉండాలి. అలా అయితేనే ఈ పథకం వర్తిస్తుంది. డబ్బుబు వధూవరులు ఇద్దరి బ్యాంక్ అకౌంట్ లలో జమచేస్తారు.