Home » 39 ఏళ్ళ‌ క్రితం అన్న‌గారి ప్ర‌మాణ‌స్వీకారం…. అదో ట్రెండ్ సెట్ట‌ర్! ఆ రోజు ఏం జ‌రిగింది?

39 ఏళ్ళ‌ క్రితం అన్న‌గారి ప్ర‌మాణ‌స్వీకారం…. అదో ట్రెండ్ సెట్ట‌ర్! ఆ రోజు ఏం జ‌రిగింది?

by Azhar
Ad

1983 జనవరి 9 అంటే స‌రిగ్గా 39 ఏళ్ళ క్రితం ఇదే రోజు… హైద్రాబాద్ అంతటా ఓ పండ‌గ వాతావ‌ర‌ణం దానికి కార‌ణం ముఖ్య‌మంత్రిగా NTR ప్ర‌మాణ స్వీకారం! అప్ప‌టి వ‌ర‌కు ఎన్నికైన ప్ర‌తి ముఖ్య‌మంత్రి రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ స‌మ‌క్షంలో ప్ర‌మాణ స్వీకారం చేసేవారు. ఫ‌ర్ ద ఫ‌స్ట్ టైమ్ ఆ సాంప్ర‌దాయాన్ని బ్రేక్ చేశారు NTR.

Advertisement

అందుకే లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలో ప్ర‌జ‌లంద‌రి స‌మ‌క్షంలో NTR ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.ఆ రోజు ఆ స్టేడియం రెండున్నర లక్షల మంది జనంతో కిటకిటలాడింది.లోప‌లికి వెళ్ల‌లేక చాలా మంది బ‌య‌టే ఆగిపోయారు. రామారావు గారి ప్ర‌మాణ స్వీకారం చూడ‌డానికి రాష్ట్రం న‌లుమూల‌ల నుండి జ‌నాలు లారీల్లో,రైళ్ళలో, బస్సుల్లో జనాలు తరలివచ్చారు. హైదరాబాద్ నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన అన్న‌గారు ఆ త‌ర్వాత ప్రజలను ఉద్దేశించి అరగంట ప్ర‌సంగించారు. ముఖ్యమంత్రిగా జీతము తీసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ ప్రభుత్వ నిబంధనలు దానికి ఒప్పుకోని కార‌ణంగా నెలకు ఒక రూపాయి గౌరవ వేతనంగా తీసుకొనేందుకు అంగీకరించారు. ల‌గ్జ‌రీ స‌దుపాయాలున్న సిఎం క్యాంప్ ఆఫీస్ కు కాకుండా అబిడ్స్ లోని త‌న ఇంట్లోనే ఉండేవారు. ఖరీదైన విలాసవంతమైన కార్లకు బ‌దులు అంబాసిడర్ కారునే వాడారు.

Visitors Are Also Reading