Telugu News » 16th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

16th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by Anji

Ads

వ‌చ్చే రెండేండ్లు ప‌రీక్ష స‌మ‌యం అని, ఎవరి ప‌నితీరు బాగాలేక‌పోయినా ఏమాత్రం ఉపేక్షించ‌బోను అని వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీ ఎమ్మెల్యే ఇంటింటికి తిర‌గాలి. మీ ప‌నితీరును క‌చ్చితంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాం. పార్టీ మ‌ళ్లీ గెల‌వ‌డ‌మే అత్యంత ప్ర‌ధానం.

నిపుణుల క‌మిటీ నివేదిక రాగానే జీవో 111 ఎత్తివేస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌కు సీఎం స‌మాధానం చెప్పారు.

యాదాద్రి శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌య మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ ముహూర్తం ఖ‌రారు అయింది. ఈనెల 28న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల 11 నిమిషాలకు మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ‌ను నిర్వ‌హించనున్నారు. ఈ నెల 21 నుంచి 28 వ‌ర‌కు పాంచ‌రాత్రాగ‌మ శాస్త్ర ప‌ద్ద‌తిలో ఉద్ఘాట‌న ప‌ర్వాలు జ‌రుగ‌నున్నాయి. నేటి నుంచి బాలాల‌యంలో అర్జిత సేవ‌లు నిలిపివేయ‌నున్న‌ట్టు ఆల‌య అధికారులు తెలిపారు.

క‌రోనా వైర‌స్ మొద‌టి సారి బ‌య‌ట‌ప‌డిన చైనాను స్టెల్త్ ఒమిక్రాన్ రూపంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ వ‌ణికిస్తోంది. చైనాలో మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే 5,280 మందికి రావ‌డం విశేషం. వ‌రుస‌గా ఆర‌వ రోజుకు వెయ్యికి పైగా కేసులు న‌మోదు అయ్యాయి.

మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్‌తో కీల‌క‌మైన మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల ధాటికి 36.2 ఓవ‌ర్ల‌లో 134 పరుగుల‌కే భార‌త్ ఆలౌట్ అయింది. స్మృతి మంధాన (35), రిచా ఘోష్ (33) గోస్వామి (20) మిన‌హా మిగ‌తా వారంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో డీన్ 4, అన్య ష్రుబ్‌సోలే 2 , సోఫీ, కేట్ క్రాస్ చెరో వికెట్ తీశారు.

అంత‌ర్జాతీయంగా, దేశీయంగా బంగారం, వెండి ధ‌ర‌లు క్ర‌మంగా దిగి వ‌స్తున్నాయి. అంత‌ర్జాతీయంగా ఈనెల 08న గ‌రిష్టంగా 2069 డాల‌ర్ల‌కు చేరిన ఔన్స్ (31.10 గ్రాముల) బంగారం ధ‌ర‌.. ప్ర‌స్తుతం 1926 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడవుతోంది. బులియ‌న్ మార్కెట్‌లో ఈనెల 08న 10 గ్రాములు మేలిమి బంగారం 55,100 ఉండ‌గా.. ప్ర‌స్తుతం 53వేల వ‌ద్ద ట్రేడ‌వుతోంది. వారం వ్య‌వ‌ధిలోనే బంగారం ధ‌ర 2100, కిలో వెండి ధ‌ర 3300 త‌గ్గింది.

ఉక్రెయిన్‌లో 30 రోజుల పాటు మార్ష‌ల్ లా పొడిగించేలా అధ్య‌క్షుడు జెలెన్ స్కీ పార్ల‌మెంట్‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. దీని ప్ర‌కారం.. 18 నుంచి 60 ఏళ్ల‌లోపు ఆరోగ్యంగా ఉన్న పురుషులు ఉక్రెయిన్ వ‌దిలి వెల్లేందుకు అనుమ‌తి లేద‌ని ప్ర‌క‌టించారు. ర‌ష్యా దాడులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో మాన‌వ వ‌న‌రుల కొర‌త రాకుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

అనుమ‌తి లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ప్ర‌సారం చేస్తున్న వెబ్‌సైట్ల‌పై నిషేధం విధించాల‌ని ఢిల్లీ హై కోర్టు ఉత్త‌ర్వులిచ్చింది. వీటిని తక్ష‌ణ‌మే బ్లాక్ చేయాల‌ని కేంద్ర స‌మాచార‌, సాంకేతిక శాఖ అధికారుల‌ను దేశించింది. ఈనెల 26న ఐపీఎల్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో స్టార్ ఇండియా దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌మ వేత‌నాలు పెంచుతూ అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న‌పై మ‌ధ్యాహ్న భోజ‌నం వండిపెట్టే మ‌హిళా కార్మికులు వ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి వేత‌నాన్ని రూ.1000 నుంచి రూ.3000 ల‌కు పెంచుతున్న‌ట్టు సీఎం చెప్పారు. కేసీఆర్ నిర్ణ‌యంతో 54,201 మంది మ‌హిళ‌ల‌కు మేలు క‌లుగ‌నుంది.

ప్ర‌పంచంలోనే ఎత్తైన ఐఫిల్ ట‌వ‌ర్ ఎత్తు 324 మీర్లు (1063 అడుగులు) . ఆకాశానికి తాకుతున్న‌ట్టు క‌నిపించే ఈ ట‌వ‌ర్ తాజాగా మ‌రింత పెరిగింది. ట‌వ‌ర్ చివ‌రి భాగంలో కొత్త‌గా దాదాపు 6 మీట‌ర్ల (19.69 అడుగుల‌) డిజిట‌ల్ రేడియో యాంటెనా అమ‌ర్చారు. దీంతో ఐఫీల్ ట‌వ‌ర్ ఎత్తు 330 మీట‌ర్ల‌కు పెరిగిన‌ట్టయింది. 130 ఏళ్ల చరిత్ర క‌లిగిన ఈ ట‌వ‌ర్‌ను చూసేందుకు ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి ప్యారిస్ వ‌స్తుంటారు.


You may also like