Home » టీఎస్:15 లక్షలు వాపస్ చేయాల్సిందే.. స్మితాసబర్వాల్ కు ఆదేశాలు జారీ చేసిన హెచ్ సీ..!!

టీఎస్:15 లక్షలు వాపస్ చేయాల్సిందే.. స్మితాసబర్వాల్ కు ఆదేశాలు జారీ చేసిన హెచ్ సీ..!!

Ad

వ్యక్తిగతంగా పరువు ప్రతిష్టలకు భంగం కలిగింందంటూ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని తీసుకోవడాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. వాటిని తిరిగి చెల్లించాల్సిందిగా సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్ ను ఆదేశించింది. ప్రభుత్వం నుంచి పరువు నష్టం దావా కోసం తీసుకున్న 15 లక్షలను 90 రోజుల వ్యవధిలో తిరిగి చెల్లించాలని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావలి నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ చెల్లించని పక్షంలో ప్రభుత్వమే ఆ తర్వాత 30 రోజుల గడువులో స్మితా సబర్వాల్ నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత పరువు నష్టం దావా కు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేసింది.

Advertisement

ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఫ్యాషన్ షో కార్యక్రమానికి హాజరైన సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ ర్యాంప్ వాక్ చేసిన కథనాన్ని ఔట్ లుక్ వార పత్రిక 2015 జూలై లో ప్రచురించింది. ఈ కథనం తో తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందంటూ 10 కోట్ల మేర ఆమె దావా వేశారు. ఇందుకు కోర్టు ఖర్చుల నిమిత్తం 14.75 లక్షలు ఖర్చు అవుతుందంటూ ప్రభుత్వానికి జూలై 29, 2017 న విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం 15 లక్షలు మంజూరు చేస్తూ 2015 ఆగస్టు 20న జీవో జారీ చేసింది. ఈ అంశాన్ని ఔట్ లుక్ పత్రిక కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

Advertisement

ప్రైవేట్ ఈవెంట్ మాత్రమేనని, ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమం కాదని, ఒక వ్యక్తిగా ఆమె పరువు ప్రతిష్టలకు భంగం కలిగితే ఆమె తన వ్యక్తిగత ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి కానీ, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని ఆశించడం, ప్రభుత్వం సైతం డబ్బులు మంజూరు చేయడం సమంజసం కాదని ఆ పిటిషన్ లో ఔట్ లుక్ పేర్కొంది. స్మితాసబర్వాల్ భర్త కూడ ఐపీఎస్ అధికారి అయినందున వారి దగ్గర కోర్టు ఫీజు, ఇతర ఖర్చుల నిమిత్తం ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ ఉండవని, ప్రజా ధనాన్ని వినియోగించడం సహేతుకం కాదని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షం అని, చట్టవ్యతిరేకమైనదని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

also read;

మామిడి ప్రియుల‌కు టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త‌.. ఇక నుంచి ఇంటి వ‌ద్ద‌కు పండ్లు..!

టీఎస్ లో గ్రూప్ 1, పోలీసు ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం.. అప్లై చేసుకోండిలా..!!

 

Visitors Are Also Reading