Telugu News » Blog » 15 మంది బాయ్‌ఫ్రెండ్స్‌.. ఇక పెళ్లి తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

15 మంది బాయ్‌ఫ్రెండ్స్‌.. ఇక పెళ్లి తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ads

సాధారణంగా యుక్త వయసులో ఎవ్వరైనా ప్రేమలో పడడం సహజం. కానీ నేటి తరుణంలో కొంత మంది అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం అలవాటుగా మారింది. సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లను అన్నింటిని వదిలేస్తున్నారు. అలాంటి ఓ అమ్మాయి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా తన చుట్టూ ఎంత మంది మగాళ్లు తిరిగితే అంత గొప్ప అని భావించింది. దీనికి తోడు ఆమెకు సినిమాల పిచ్చి. బొయ్ఫ్రెండ్స్ తో కలిసి నిత్యం సినిమాలకి, షికార్లకి వెళ్ళేది. ఇక తాను చదుకున్న కాలేజీ రోజుల్లో ఏకంగా 15 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చింది. ఇంత తంతు జరిగినప్పటికీ ఎలాగో అలాగా పెళ్లి అయితే చేసుకుంది. ఆ తర్వాత అయినా కాస్త బుద్ధిగా ఉందా అంటే అది కూడా లేదు. పెళ్లి తర్వాత కూడా ఆమె ప్రేమాయాణం కొనసాగించింది. ఈ విషయం కట్టుకున్న భర్తకు తెలిసి మందలించాడు. అయితే భర్తను తమ దారి నుంచి అడ్డు తొలగించుకోవాలని భావించింది. తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఇక తర్వాత అమాయకంగా నటించింది. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read :  ప్రతిరోజు పరిగడుపున జీలకర్ర వాటర్ తాగితే కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

Advertisement

వివరాల్లోకి వెళ్ళితే.. ఏపీ లోని సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన చంద్ర శేఖర్ కి, శ్వేతతో పెళ్లి జరిగింది. శ్వేతకు కాలేజీలో చదువుకున్న రోజుల్లోనే చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్‌ కలిగి ఉందట. ముఖ్యంగా బెంగళూరు లో ఎంసీఏ చదివే రోజుల్లో చాలా మంది యువకులతో డేటింగ్‌ చేసింది. ఎంత ఎక్కువ మంది బాయ్‌ఫ్రెండ్స్‌ ఉంతే అంత గొప్ప విషయం అని భావించింది. దాదాపు 15 మంది బాయ్ ప్రెండ్స్ ని మార్చింది. రోజుకు ఒకరి చొప్పున వారితో సరదాగా తిరగడం, ఎంజాయ్ చేయడం.. ఆ తరువాత వారి నెంబర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చేసేది. ఈ తరుణంలోనే ఇంటి ఓనర్‌ కుమారుడితో కూడా చనువుగా మెలిగేది. అతడి బైక్‌పై కాలేజీకి వెళ్లడం, షికార్లకు వెళ్లడం చేసింది. ఆమె ఇంటి ఓనర్ కొడుకు సురేష్ ని ప్రేమిస్తూనే చంద్ర శేఖర్ ని వివాహం చేసుకుంది.

Also Read :  వాస్తుశాస్త్రం ప్రాకారం ఈ మూడు వ‌స్తువులను ఇంట్లో పెట్టుకోవ‌ద్ద‌ట‌..అవి ఉంటే ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంటే..?


ఈమె తతంగం భర్తకి తెలియడంతో భర్త మందలించాడు. ఎలాగైనా భర్తను అంతమొందించాలని ప్రియుడు సురేష్ తో కలిసి ప్లాన్ వేసింది. కర్ణాటక లోని యలహంక కొండప్ప లే అవుట్ లో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. ఒక రోజు శ్వేత ఇంట్లో నీళ్లు రావడం లేదని.. పైకి వెళ్లి ట్యాంక్ వద్ద ఏమైందో చూసి రా అని భర్తకి చెప్పింది. అప్పటికే అక్కడ సురేష్ కాపు కాచుకొని సిద్ధంగా ఉన్నాడు. భార్య మాట విని పైకి వెళ్లిన చంద్ర శేఖర్ పైకి వెళ్ళగానే సురేష్ వెనుక నుంచి అకస్మాత్తుగా ఇనుప రాడ్డు తో బలంగా తలపై బాదాడు. తలతో పాటు ప్రయివేట్ పార్ట్ పై కూడా దాడి చేశాడు. అంతేకాదు.. ప్రయివేట్ పార్ట్ ని కత్తిరించి దారుణానికి పాల్పడ్డారు. ఇక భార్య శ్వేత ఏమీ తెలియని అమాయకురాల్లాగా వ్యవహరించింది. తన భర్తను ఎవరో చంపారని.. వెక్కి వెక్కి ఏడ్చింది. పోలీసుల విచారణలో అసలు విషయము వెలుగులోకి వచ్చింది. శ్వేత, ప్రియుడు సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Also Read :  జలుబు చలికాలంలోనే ఎందుకు వస్తుంది.. దీనికి అసలు కారణం ఇదేనా ?