Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ :ఆ 15 మంది బీజేపీ నేతలు కేసీఆర్ కోవర్టులు.. అసలు విషయాలు బయటపెడతా..?

మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ :ఆ 15 మంది బీజేపీ నేతలు కేసీఆర్ కోవర్టులు.. అసలు విషయాలు బయటపెడతా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

కొన్ని నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలోనే అన్ని పార్టీల నాయకులు రాజకీయ సమీకరణాలు మారుస్తున్నాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో నేతలంతా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని బిజీగా ఉంటున్నారు. ఇక పార్టీలలో వలసలు మొదలయ్యాయి.

Advertisement

Ad

అసమ్మతి నేతలు బయటకు వచ్చి మీడియా ముఖంగా అన్ని విషయాలు బయటపెడుతున్నారు. ఈ తరుణంలోనే బిజెపి కీలక నేత పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కీలక విషయాలు బయట పెట్టారు. బిజెపిలో ఉండేటటువంటి 15 మంది నేతలు కేసిఆర్ కు కోవర్టులని , త్వరలో వారి పేర్లను బిజెపి పెద్దలకు తెలియజేస్తానని మీడియా ముఖంగా తెలియజేశారు.

Advertisement

15 రోజుల్లో వారు మారకపోతే వారి పేర్లు తప్పనిసరిగా బయట పెడతానని చెప్పడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతేకాకుండా నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరతాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఇలా మాట్లాడడం ఆ వార్తలకు బలం చేకూరినట్టు అయింది. మరి చూడాలి ఈ కీలక నేతతో బిజెపికి తలనొప్పి వస్తుందా.. లేదంటే సిట్రైట్ అవుతుందా ముందు ముందు తెలుస్తుంది.

also read:

Visitors Are Also Reading