Home » 12th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

12th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముకం ప‌ట్టాయి. తాజాగా 50,407 కొత్త కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 804 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దేశంలో ప్రస్తుతం 6,10,443 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అమెరికాలో తెలుగు విద్యార్థి చట్టూరి సత్యకృష్ణ దారుణహత్యకు గుర‌య్యారు. దుండ‌గులు విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపారు. అతడి స్వస్థలం విశాఖ కాగా స‌త్యకృష్ణ నెలరోజుల క్రితమే అమెరికా వెళ్లారు.

Advertisement

ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు పడమటలంకలోని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్ల‌నున్నారు. అశోక్‌బాబు శుక్రవారం అర్ధరాత్రి బెయిల్‌పై విడుదల కాగా చంద్రబాబు ఆయ‌న‌ను పరామ‌ర్శించారు.

cm kcr

cm kcr

సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ యాదాద్రి చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటలకు రాయగిరిలో కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారు.

గ‌త రాత్రి జూబ్లీహిల్స్ లాన్ పార్కింగ్‌లో నాలుగు కార్లు అగ్నికి ఆహుత‌య్యాయి. ఓ కారు ఇంజిన్‌లో మంట‌లు చెల‌రేగ‌గా ప‌క్క‌నే ఉన్న మూడు కార్ల‌కు వ్యాపించాయి. దాంతో నాలుగు కార్లు పూర్తిగా దగ్దం అయ్యాయి. మంట‌ల‌ను ఫైర్ సిబ్బంది అదుపుచేస్తున్నారు.

Advertisement

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాచ‌న‌ప‌ల్లి పీఎస్ లో తుపాకీ మిస్ ఫైర్ అవ్వ‌డంతో కానిస్టేబుల్ సంతోష్ మృతి చెందారు.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ ఊపందుకుంది. మార్చి 18 నాటికి కొత్త జిల్లాలు రెడీ అవుతుండ‌గా ఎప్రిల్ 2 నుండి కార్య‌క‌లాపాలు షురూ కానున్నాయి.

భార‌త్ లో గంట‌పాటూ ట్విట్ట‌ర్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. రాత్రి 11 గంట‌ల నుండి ట్విట్ట‌ర్ మొరాయింపు మొద‌ల‌య్యింది. టెక్నిక‌ల్ ఇష్యూ వ‌ల్లనే ఇలా జ‌రిగింద‌ని ట్విట్ట‌ర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ ఈ నెల 17న భేటీ కానుంది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రెటరీ తెలంగాణ, ఏపీ నుండి ఒక్కొక్కరూ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

అగ్రరాజ్యం అమెరికాపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. అమెరికా వాడుకుని వదిలేసే ర‌క‌మని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మక లక్ష్యాలను సాధించుకునేందుకు పాకిస్తాన్ ను ఉపయోగించుకోవడం అవసరం తీరాక పక్కన పెట్టడుతుంద‌ని త‌మ‌కు మిత్ర దేశం చైనా అండగా ఉంటుందని చెప్పారు.

Visitors Are Also Reading