దేశంలో కరోనా కేసులు తగ్గుముకం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 44,877 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 5,37,045 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. లోన్ ఎగవేసిన కేసులో శిల్పాశెట్టితో పాటు ఆమె సోదరి, తల్లికి ముంబై కోర్టు సమన్లు జారీ జారీచేసింది. ఇప్పటికే పోర్నోగ్రఫీ కేసులో శిల్పా భర్త రాజ్ కుంద్రా చిక్కుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
దేశంలో బంగారం ధరలు పెరిగాయి. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050 గా ఉంది. అంతే కాకుండా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,800 గా ఉంది.
నేటి నుండి మత్స్యకారులకు అండగా జనసేన పాదయాత్ర చేస్తోంది. కాకినాడ రూరల్ మత్స్యకార ప్రాంతాల నుండి జనసేన నేత నాదెండ్ల మనోహర్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. జీవో 217 రద్దుకోసం ఉభయగోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 20న నర్సాపురంలో బహిరంగసభను ఏర్పాటు చేస్తారు. ఈ సభకు అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.
Advertisement
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 16 నుండి స్కూళ్లు, థియేటర్లను ప్రారంభించనున్నారు. ఇక వివాహాలకు 200 మందికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో ప్రతి రోజు 15వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తునట్టు ప్రకటించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాలలో టికెట్లను జారీ చేయనుంది. రెండేళ్ల అనంతరం మొట్ట మొదటి సారి అత్యధిక సంఖ్యలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జైల్ భరో నిర్వహిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ నుంచి కార్మికులు ర్యాలీ చేపడుతున్నారు.
రాష్ట్రపతి రామ్ నాత్ కోవింద్ నేడు హైదరాబాద్ కు వస్తున్నారు. ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న రామానుజాచార్యుల వేడుకలకు కోవింద్ హాజరవుతున్నారు.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రుల్లో పేదలు చనిపోతే వారి పార్థివదేహాలను ఇండ్లకు పంపించే ఏర్పాట్లను చేస్తోంది.
హిజాబ్ వివాదం పై సమాజ్ వాద్ పార్టీ నాయకురాలు రుబీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ను తాకితే చేతులు నరుకుతామని అన్నారు. మన దేశ అక్కా చెల్లెల్ల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దని అన్నారు.