Home » ఈ బైక్ కొన్నారంటే 1,25,000 డిస్కౌంట్.. ఆఫర్ అదిరిపోలా..!!

ఈ బైక్ కొన్నారంటే 1,25,000 డిస్కౌంట్.. ఆఫర్ అదిరిపోలా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలామందికి ఒక బైక్ కొనుక్కోవాలని, దానిపై రైడ్ చేయాలని ఆశ ఉంటుంది. అలా బైక్ రైడింగ్ చేసే వారికి అదిరిపోయే శుభవార్త. ఈ బైక్ కొంటే లక్ష రూపాయల పైగానే డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే కొనేయండి.. బైక్ కొనాలని ఆలోచన ఉన్నవారికి కంపెనీలు చాలా మంచి ఆఫర్ ఇస్తున్నాయి. ఈ తరుణంలోనే ఈ కంపెనీ భారీ డిస్కౌంట్ అందించింది. ఇయర్ ఎండింగ్ కావడంతో ఈ ఆఫర్ ను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో కవసాకి వచ్చి కూడా చేరింది. ఈ కంపెనీ తన బైక్ పై భారీ తగ్గింపు ఆఫర్ ఇస్తోంది.

Advertisement

also read;పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ రీరిలీజ్ ట్రైలర్ చూశారా ? 

Advertisement

కవాసకి కంపెనీకి చెందిన W800 రెట్రో క్రుయిజర్ బైక్ పై భారీ ఆఫర్ అందిస్తోంది. మీరు ఈ కవసాకి W800 రెట్రో బైక్ పై ఏకంగా 1.25 లక్షల రూపాయల తగ్గింపు చేస్తోంది. ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉందని ఈ బైక్ కావాలనుకునే వారు ఈ సమయంలోనే కొనుగోలు చేయాలని కంపెనీ చెబుతోంది. కావసకి W800 రేట్రో క్రుయిజర్ మోటార్ సైకిల్ షోరూం ధర 7.33లక్షలు గా ఉంది. ఇందులో 773 CC ఇంజన్, ఎయిర్ కూల్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజనును అమర్చారు.

ఇది 47.5HP పవర్, 62.9NM టార్కు కలిగి ఉంది. ఈ బైక్ లో మొత్తం ఐదు గేర్లు ఉంటాయని, ముందు భాగంలో 320 ఎమ్ ఎమ్ డిస్క్, వెనుక భాగంలో 270 ఎంఎం డిస్క్ ఉంటుందని కంపెనీ తెలుపుతోంది. అంతేకాకుండా బైకులో ఎల్ఈడి హెడ్లైట్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి. అంతేకాకుండా కవాసకి జెడ్ 650 బైక్ పై కూడా ఆఫర్ ఉంది. దీనిపై 35000 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ బైక్ కూడా ఆరు గేర్లతో ఉంది . అంతేకాకుండా కవాసా కి నింజా 300 బైకుపై పదివేల తగ్గింపు ఉందని కంపెనీ నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

Also read;కాంతార 2 లో జరగబోయేది ఇదేనా..? ఇది నిజమైతే నెక్స్ట్ లెవెల్ ..!!

Visitors Are Also Reading