దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 58,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా 657 మరణాలు నమోదయ్యాయి.
హైదరాబాద్ నగరంలో కార్లు అద్దెకు తీసుకుని అమ్ముకుంటున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్లలో ఉన్న జీపీఎస్‌ను తీసివేసి ఇతర రాష్ట్రాలలో కార్లను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Advertisement
ఏపీ సీఎం జగన్ నేడు మరోసారి హైదరాబాద్ రానున్నారు. హైటెక్స్‌లో మంత్రి బొత్స కుమారుడి వివాహానికి జగన్ హాజరుకానున్నారు. ఇక రీసెంట్ గా సమతామూర్తి విగ్రాన్ని చూసేందుకు సీఎం వచ్చిన సంగతి తెలిసిందే.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నశింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మృతులు అరవింద్, నవీన్, ఆనంద్, వినేష్‌గా గుర్తించారు.
Advertisement
గురువారం అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్ అయ్యారు. పదోన్నతి విషయంలో విద్యార్హత తప్పుగా చూపించారని అశోక్‌బాబుపై ఆరోపణలు ఉన్నాయి. అయితే అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని టీడీపీ నేతలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ నేడు జనగామ పర్యటనకు వెళుతున్నారు. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాలు మరియు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం తిరుమల పుష్పగిరి మఠంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి కేంద్రమంత్రులు, మంత్రులు ప్రముఖులు హాజరయ్యారు.
కేరళలో మొదటి మంకీ ఫీవర్ కేసు నమోదైంది. 24 ఏళ్ల యువకుడు జ్వరంతో ఆస్పత్రికి రాగా మంకీ ఫీఫర్ గా నిర్ధారణ అయ్యింది.
విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ల్యాండ్ అయిన తరవాత ఆర్టీపీసీఆర్ పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలు ఎత్తివేసినట్టు ప్రకటించింది.
పాకిస్థాన్ పెషావర్ లో దారుణం చోటుచేసుకుంది. అబ్బాయి పుట్టేలా చేస్తా అంటూ ఓ నఖిలీ బాబా నిండు గర్భిణి తలలో మేకును దింపాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా నఖిలీ బాబా పరారీలో ఉన్నాడు.