ప్రస్తుతం థియేటర్లో సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళి పోతున్నాయి. కానీ టాలీవుడ్ లో సంవత్సరం నుండి వెయ్యి రోజుల పాటు థియేటర్ లో ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన 10 సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Advertisement
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమా రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమా ఒక థియేటర్ లో వెయ్యి రోజుల పాటు ఆడింది.
మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పోకిరి. 2006లో విడుదలైన ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.. థియేటర్లలో ఈ సినిమా 580 రోజులు ఆడింది.
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా లెజెండ్. 2014 లో విడుదలైన ఈ సినిమా 2017వరకు థియేటర్లో ఆడింది.
బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా మంగమ్మ గారి మనవడు. ఈ సినిమా ఏకంగా 567 రోజులు రన్ అయ్యింది.
Advertisement
బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా మరో చరిత్ర. ఈ సినిమా 565 రోజుల పాటు లేకుండా ఆడింది.
నందమూరి తారకరామారావు హీరోగా నటించిన సినిమా లవకుశ. ఈ సినిమా టాలీవుడ్ లో మొదటి కలర్ సినిమా కాగా 469 రోజులు థియేటర్ లలో ఆడింది.
దాసరి నారయణరావు దర్శకత్వం లో ఎఎన్ఆర్ హీరోగా నటించిన సినిమా ప్రేమాభిషేకం. ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా 533 రోజుల పాటు థియేటర్ లలో ఆడింది.
ఎన్టీఆర్ రాఘవేద్రరావు కాంబినేషన్ లో వచ్చిన సినిమా అడవిరాముడు. ఈ సినిమా ఏడాది పాటు థియేటర్ లలో ఆడింది.
ఎన్టీఆర్ శ్రీదేవి హీరో హీరోయిన్ లు గా నటించిన సినిమా వేటగాడు. ఈ సినిమా 409 రోజుల పాటు థియేటర్ లలో రన్ అయ్యింది.
శింబు తండ్రి టి. రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేమసాగరం. ఈ సినిమా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో 465 రోజుల పాటు థియేటర్లలో ఆడింది.