Home » రాత్రిపూట భోజనం తర్వాత 10 నిముషాలు వాకింగ్ చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

రాత్రిపూట భోజనం తర్వాత 10 నిముషాలు వాకింగ్ చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత కాలంలో చాలామంది బిజీ లైఫ్ లో భాగంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మర్చిపోతున్నారు.. డబ్బులే లక్ష్యంగా పని చేస్తూ ఎన్నో వ్యాధుల బారిన పడుతూ చివరికి ఇబ్బందుల పాలవుతున్నారు.. ప్రతిరోజు ఎంతమంది వ్యాయామం చేస్తున్నారు అని చూసుకుంటే వందలో 70 శాతం మంది వ్యాయామానికి దూరంగానే ఉంటున్నారు.. అలాంటి వారి కోసం ఆరోగ్య నిపుణులు ఈ చిన్న చిట్కా ను అందించారు.. దీనివల్ల మీకు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు అది ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. చాలామంది రాత్రిపూట భోజనం చేసిన తర్వాత పడుకుంటారు..

Advertisement

also read:సమంత పారితోషికం విషయంలో కొత్త కండిషన్స్.. అలా అయితే నా దగ్గరకు రండంటూ..!!

అలా పడుకునే బదులు కనీసం పది నిమిషాలపాటు అయినా అటూ ఇటూ నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు.. అలాగే భోజనం తర్వాత పడుకొని చాలా మంది ఫోను చూడడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయట.. ఒక రోజులో సమయం లేక పోయినా సరే భోజనం తర్వాత మాత్రం తప్పనిసరిగా పది నిమిషాలు నడవడం మంచిది. శరీరం చురుగ్గా ప్రశాంతంగా ఉండాలంటే వాకింగ్ అనే హ్యాబిట్ అలవర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. రాత్రిపూట భోజనం తర్వాత నడవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయి.

Advertisement

దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.ఉబ్బసం, మలబద్ధకం సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నడక వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇలా చేయడం వల్ల బ్లడ్,షుగర్ అదుపులో ఉండటమే కాకుండా జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి రాత్రిపూట భోజనం తరువాత వాకింగ్ తప్పనిసరి. మెయో క్లినిక్ అధ్యయనాల ప్రకారం చూస్తే నడక ఒత్తిడిని తగ్గిస్తుందని, శరీరంలోని ఎండార్ఫిన్లను పెంచుతుందని అంటారు. అలాగే డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

also read:19 ఏళ్ళకే ఆ నటుడి తమ్ముడితో ప్రేమ పెళ్లి…నటి హేమ లవ్ స్టొరీ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే…!

Visitors Are Also Reading