Home » కామన్వెల్త్ లో మాయమైన లంక ప్లేయర్స్.. అందుకోసమేనా..?

కామన్వెల్త్ లో మాయమైన లంక ప్లేయర్స్.. అందుకోసమేనా..?

by Azhar
Ad

ఇంగ్లాండ్ లోని బర్మింగామ్ వేదికగా ఈ 2022 యొక్క కామన్వెల్త్ క్రీడలు అనేవి జరిగిన విశయం తెలిసిందే. ఇందులో మన ఇండియాతో కలిపి మొత్తం 72 దేశాలు అనేవి ఉన్నాయి. ఇక గత నెల 28 ప్రారంభమైన ఈ గేమ్స్ ఈ నెల 8న విజయవంతంగా ముగిసాయి. అయితే ఇందులో మన పొరుగుదేశమైన శ్రీలంక ప్లేయర్స్ కూడా పాల్గొన్నారు. మొత్తం 60 మంది మహిళలు 50 మంది పురుషులతో కలిసి 110 లంక ప్లేయర్స్ ఇందులో పాలుపంచుకున్నారు.

Advertisement

అయితే ఆటగాళ్లతో పాటుగా మొత్తం 50 మంచి కోచింగ్ స్టాఫ్ ను కూడా పంపింది లంక. కానీ ఈ గేమ్స్ అనేవి ముగింపు దశకు వచ్చిన తర్వాత లంక జట్టులో లెక్క అనేది దొరకలేదు. కోచింగ్ స్టాఫ్ తో కలిపి వచ్చిన 160 మందిలో 10 మంది కనిపించకుండా పోయారు. అయితే ఈ గేమ్స్ లో పాల్గొనడానికి వచ్చిన అందరికి ఆరు నెలల వీసా అనేది ఉంటుంది.

Advertisement

దాంతో వారు తాము తెచ్చుకున్నా వస్తువులు అన్ని అక్కడ క్రీడా గ్రామంలోనే వదిలేసి ఎవరితో చెప్పకుండా వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు లంకలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విశయం తెలిసిందే. అక్కడ ఒక్కపూట తిండి దొరకడం కూడా కష్టంగా మారిపోయింది. పొరుగుదేశాలకు వెళదాం అంటే వీసా కూడా దొరకడం లేదు. అందుకే ఈ క్రీడల కోసం వచ్చినవారు మళ్ళీ లంకకు వెళ్లి కష్టాలు పడటం ఇష్టం లేక ఇప్పుడే ఎక్కడికో వెళ్లిపోయారు అనే చర్చ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి :

కామన్వెల్త్ లో మెడల్స్ సాధించిన క్రికెటర్ల భార్యలు వీళ్ళే..!

టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై ధావన్ కామెంట్స్..!

Visitors Are Also Reading