Home » ఇండస్ట్రీ హిట్ మూవీస్ ను మిస్ చేసుకున్న 10 మంది హీరోలు.. ఎవరంటే..?

ఇండస్ట్రీ హిట్ మూవీస్ ను మిస్ చేసుకున్న 10 మంది హీరోలు.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ హీరో హీరోయిన్ కైనా సినిమా ఇండస్ట్రీ లో ఒక్క హిట్ కొడితే కలిగే ఆనందం కంటే ఏది ఎక్కువ కాదు. ఒక్కోసారి ఒక్క ఇండస్ట్రీ హిట్ తోనే స్టార్ హీరోలుగా మారిన హీరోలు,హీరోయిన్లు, నటీనటులు ఉన్నారు. కొంతమంది ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. అలా తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాలను వదులుకున్న స్టార్ హీరోలెవరో ఇప్పుడు తెలుసుకుందాం..


1. పాతాళభైరవి :

Advertisement

Also Read:జక్కన్న ఆ వ్యక్తిని కొట్టించాలనుకున్నారట.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

అలనాడు అన్న ఎన్టీఆర్ కు పాతాళ భైరవి మూవీ ఇండస్ట్రీలోనే తిరుగులేని హిట్ ఇచ్చింది. కానీ ఈ సినిమాకు ముందు అనుకున్న హీరో ఏఎన్నార్.
2. దేవదాస్:


పాతాళ భైరవి మూవీ తర్వాత వచ్చింది దేవదాస్ మూవీ. విచిత్రంగా పాతాళభైరవిని ఏఎన్ఆర్ వదులుకుంటే, దేవదాస్ మూవీ ని ఎన్టీఆర్ వదులుకున్నారు. ఈ మూవీని ఏఎన్ఆర్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
3. అడవి రాముడు:


ముందుగా అడవి రాముడు సినిమా శోభన్ బాబు వద్దకు వెళ్లిందట. కానీ ఆయనకు డేట్స్ కుదరకపోవడంతో ఆయన ఎన్టీఆర్ పేరు చెప్పారట. ఈ మూవీని ఎన్టీఆర్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
4. పసివాడి ప్రాణం:


ఈ మూవీ ముందుగా సూపర్ స్టార్ కృష్ణ చేయాలనుకున్నారట. కానీ ఏవో కారణాల వల్ల మిస్ అవ్వడంతో చిరంజీవి చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
5. గ్యాంగ్ లీడర్:

Advertisement

Also Read: అద్దె గ‌ర్భం ద్వారా పిల్ల‌ల‌ను క‌న్న సెల‌బ్రెటీలు వీళ్లే..!
ఈ చిత్రానికి ముందుగా నాగబాబుతో చేద్దామని కథ రెడీ చేశారట. కానీ ఏవో కారణాలవల్ల ఈ మూవీ చిరంజీవికి వెళ్ళింది. ఇండస్ట్రీ హిట్ అయింది..
6. చంటి:


చంటి మూవీ ని ముందుగా రాజేంద్ర ప్రసాద్ తో చేద్దామనుకున్నారట. కానీ చివరికి వెంకటేష్ ఈ చిత్రానికి ఫైనల్ అయ్యారు. ఈ మూవీ వెంకటేష్ కెరియర్ నే మార్చేసింది.
7. సమరసింహారెడ్డి :


యాక్షన్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బాలకృష్ణ.. అయితే బాలకృష్ణ చేసిన సమరసింహారెడ్డి ముందుగా వెంకటేష్ వద్దకు వెళ్లిందట. కానీ ఆయనకు కుదరకపోవడంతో బాలకృష్ణ చేసి సూపర్ హిట్ కొట్టారు.
8. కలిసుందాం రా:


తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన కలిసుందాం రా మూవీ ముందుగా నాగార్జునకి వెళ్ళిందట. కానీ ఆయనకు వేరే సినిమా డేట్స్ ఉండడంతో వెంకటేష్ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
9. నువ్వే కావాలి:


నువ్వే కావాలి మూవీకి ముందు అనుకున్నా హీరో సుమంత్. ఏం జరిగిందో ఏమో కానీ మళ్ళీ అది తరుణ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
10. పోకిరి:


తెలుగు సినిమా చరిత్రలోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన మూవీ పోకిరి. ఈ మూవీని ముందుగా రవితేజతో చేద్దాం అనుకున్నారట పూరి జగన్నాథ్. కానీ రవితేజ కి డేట్స్ కుదరకపోవడంతో మహేష్ బాబు చేశారు.

Also Read:Balagam Movie Review : “బలగం” సినిమా రివ్యూ

Visitors Are Also Reading