Home » బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవే….!

బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవే….!

by AJAY

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో బాలయ్యకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. పలువురు దర్శకులు బాలయ్యతో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుంది.

Sreekanth addala

ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకొన్నారు. అనిల్ రావిపూడి ఇప్పటికే ఎఫ్ 3 సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. దాంతో బాలయ్య సినిమా పైనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. మరో వైపు బాలకృష్ణ కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Balayya

Balayya

ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తీసిన శ్రీకాంత్ అడ్డాల బాలయ్యకు ఒక కథ వినిపించారని ఆ కథ నచ్చడంతో బాలకృష్ణ కూడా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ అడ్డాల మొదటి సినిమా కొత్త బంగారు లోకం కూడా దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా దిల్ రాజు నిర్మించారు. అయితే ఇప్పుడు బాలయ్య సినిమాకు నిర్మాతగా వ్యవహరించే అవకాశాన్ని దిల్ రాజు దక్కించుకున్నారు. ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్టు సమాచారం.

Visitors Are Also Reading