Home » పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పై కేంద్రం కీలక ప్రకటన..!

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పై కేంద్రం కీలక ప్రకటన..!

by Anji
Published: Last Updated on

ఆంధ్రప్రదేశ్ లోని కీలక ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అని స్పష్టం చేసింది. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వశ్వర్ సమాధానం చెప్పారు. గోదావరి ట్రిబ్యునల్ 1980లో అవార్డు ప్రకారం.. పోలవరం రిజర్వాయర్ సామర్థ్యం 45.72 మీటర్లని వెల్లడించారు. 

Also Read :  40 ఏళ్లు దాటిన మహిళలు భర్త దగ్గర ఇదే కోరుకుంటారట..!!

మొదటి దశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని గతవారం పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం స్పష్టం చేసింది. 2017-18 ప్రకారం.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.47,725 అని స్పష్టం చేశారు. 2019లో జలశక్తి శాఖకు ఇచ్చిన సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు కాగా అంచనాలను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది. 2020లో రివైజ్ క్లాస్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. 2013-14 ధరల ప్రకారం.. అంచనా వ్యయం రూ.29,027.95 కోట్లు అని కేంద్రమంత్రి తెలిపారు. 

Also Read :  ఐపీఎల్ లో రీఎంట్రీ ఇవ్వనున్న ఆసీస్ కీలక ప్లేయర్ ఎవరో తెలుసా ?

ప్రాజెక్టు కోసం భూ సేకరణ, పరిహారం, పునరావాసం ధరల్లో పెరుగుదలే ప్రాజెక్టు వ్యయం పెరగడానికి కారణం అని కేంద్రం పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ కోసంకేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.13,463 కోట్లు విడుదల చేసినట్టు సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు మొత్తం 1,13,119 ఎకరాల భూమిని సేకరించారు. పోలవరం నిర్మాణంలో భూసేకరణ వ్యయం ఎక్కువగా ఉన్నందున రెండు దశల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. రెండు దశల్లో కలిపి మొత్తం 45.72 మీటర్ల ఎత్తు పూర్తి చేస్తామని ఆంధ్రప్రభుత్వం చెబుతోంది. 

Also Read :  అన్నదమ్ముల వివాదంపై మంచు మనోజ్ ఏమన్నారో తెలుసా ?

Visitors Are Also Reading