Home » పవన్ హీరోయిన్ కీర్తి రెడ్డి కి, బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ కి ఉన్న రిలేషన్ అదేనా ?

పవన్ హీరోయిన్ కీర్తి రెడ్డి కి, బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ కి ఉన్న రిలేషన్ అదేనా ?

by Azhar
Published: Last Updated on
Ad
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ ఆయన సినిమా గురించి ప్రశ్నించినప్పుడు అందరికి గుర్తుకు వచ్చే మొదటి సినిమా తొలిప్రేమ. ఈ సినిమా పవన్ కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా మిగిలిపోవడం మాత్రమే కాకుండా… విడుదల అయిన రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా హీరోయిన్ కీర్తి రెడ్డికి కూడా మంచి పేరు వచ్చింది. ఇందులో కీర్తి రెడ్డి నటనకు అభిమానులు ఫుల్ మార్కులు వేసేసారు.
ఈ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిన కీర్తి రెడ్డి తర్వాత తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని భాషలో కూడా నటించింది. ఇక ఆ తర్వాత మన తెలుగు హీరో సుమంత్ ను పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత సుమంత్ ఫ్యామిలీతో కీర్తి రెడ్డి ఇబ్బందులు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కీర్తి రెడ్డి మరొకరిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు యూఎస్ లో ఉంటున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే కీర్తి రెడ్డికి ఓ కజిన్ ఉన్నాడు. కానీ అతను మన తెలుగు హీరో అని చాలా మందికి తెలియదు.
అతను ఎవరో కాదు సామ్రాట్. అయితే సామ్రాట్ కు బిగ్ బాస్ ద్వారా మంచి పేరు వచ్చింది. బిగ్ బాస్ 2 లో ఫైనలిస్ట్ గా నిలిచిన సామ్రాట్ మంచి మంచి సినిమాల్లో కూడా నటించారు. స్టార్ హీరోయిన్ అనుష్కతో కలిసి పంచాక్షరి సినిమాలో చేసిన సామ్రాట్ కొన్ని సినిమాల్లో విలన్ గా ఇంకొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్, హీరోయిన్ బ్రదర్ గా కూడా నటించాడు. కానీ ఇప్పటివరకు ఎవరికీ సామ్రాట్ కు కీర్తి రెడ్డికి ఉన్న ఈ రిలేషన్ గురించి మాత్రం ఎవరికీ తెలియదు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading