Home » ఆ స్టార్లే విఫలమవుతున్నారు.. నేను అయితే తప్పా…?

ఆ స్టార్లే విఫలమవుతున్నారు.. నేను అయితే తప్పా…?

by Azhar
Published: Last Updated on
Ad

ఐపీఎల్ 2022 లో ఎవరు ఊహించని విధంగా 15.25 కోతలను దకించుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్. అయితే గత ఐపీఎల్ లో బ్యాట్ తో మంచి పరుగులు రాబట్టిన ఇషాన్.. ఆ తర్వాత టీం ఇండియా తరపున కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో అతని కోసం వేలంలో పోటీ పెరగగా… ముంబై అతనికి భారీ ధర ఇచ్చి మళ్ళీ తీసుకుంది. దాంతో అతను ఈ ఏడాది ఐపీఎల్ లో భారీగా పరుగులు చేస్తాడు.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

Advertisement

జట్టు యాజమాన్యం ఊహించిన దానికి విరుద్ధంగా విజయాలలో కాకుండా.. పరాయజాలలో ఇషాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. లీగ్ ప్రారంభమైన తర్వాత రెండు మూడు మ్యాచ్ లలో మినహా అన్ని మ్యాచ్ లలో విఫలమవుతూ వస్తున్నాడు. దాంతో ఇషాన్ పై విమర్శలు భారీ ఎత్తున వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన వైఫల్యాలపై ఇషాన్ స్పందించాడు. అతను మాట్లాడుతూ… క్రికెట్ ప్రపంచంలోని ప్రతి ఆటగాడు ఇలాంటి వైఫల్యాలను ఎదుర్కున్నాడు. అంతెందుకు.. టీ20 అంటేనే విజృంభించే క్రిస్ గేల్ కూడా గతంలో చాలా ఇబ్బందులు పడ్డాడు.

Advertisement

ఓ క్రికెటర్ కు ప్రతి రోజు… ప్రతి మ్యాచ్ కొత్త దానితోనే సమానం. కొన్నిసార్లు పరుగులు చేస్తారు…. కొన్నిసార్లు చేయరు. ఒక బ్యాటర్ గ్రౌండ్ కు బయట ఎంత బాగా సిద్ధమై వచ్చిన… బౌలర్లు బౌలింగ్ కట్టుదిట్టంగా చేసినప్పుడు మనం అనుకున్న విధంగా ఆడలేం. ఒకేవేళ వికెట్లు త్వరగా పడిపోతే.. మన వికెట్ కాపాడుకోవాలి. తర్వాత వచ్చే బ్యాటర్లతో భాగసౌమ్యాలు నెలకొల్పాలి. అది చేజింగ్ అయితే ఇంకా జాగ్రత్తగా ఆడాలి’ అని ఇషాన్ తెలిపాడు. అయితే ఇషాన్ ఎన్ని చెప్పిన.. అతని వైఫల్యం కారణంగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ జట్టులో అతనికి స్థానం లేదు అనేది మాత్రం పక్కాగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

బాలీవుడ్ లోకి ధావన్… షూటింగ్ కూడా పూర్తి…!

హల్ ఆఫ్ ఫేమ్‌ ను ప్రారంభించిన బెంగళూర్.. మొదటిగా ఆ ఆటగాళ్లకు చోటు..!

Visitors Are Also Reading