ప్రజా కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పునరుద్ఘాటించారు.
అనతికాలం లోనే సామాజిక న్యాయానికి  బహుజన లెఫ్ట్ ఫ్రంటు ఐకాన్ గా నిలిచిందని ఫ్రంట్ కన్వీ నర్ తమ్మినేని వీరభద్రం అన్నారు.
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకంగా ఒక రంగు అంటూ ఏమి ఉండ కూడదనీ, ఆమేరకు తగుజాగ్రతలు తీసుకోవాలని కేంద్ర ఎన్ని కల సంఘం స్పష్టం చేయడంతో ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి డా.రజత్ కుమార్ వెల్లడిం చారు.
ప్రజల మధ్య ఎటువంటి భేదాలు లేకుండా కేసీఆర్ పాలించారని తాజా మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం నగరంలోని నాంపల్లిలో జరిగిన మైనార్టీల సభలో ఆయన పాల్గొన్నారు.
ఎన్నికల  బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికను అన్ని పార్టీలు పూర్తి చేశాయి,  ప్రత్యర్థులెవరో తేలిపోయింది.
కాంగ్రెస్ పార్టీ తన మూడో జాబితాను శనివారం ప్రకటించింది. తుది జాబితాను ఆదివారం విడుదల చేయనుంది.
కూటమి తరఫున జనగామ నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని.. ఇక అక్కడి నుంచి బీసీ నేత పొన్నాల లక్ష్మయ్య బరిలోకి దిగుతారని ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జ్ కుంతియా పేర్కోన్నారు.
కూటమిలో సీట్ల పంపకాలు దాదాపు పూర్తయినప్పటికీ అభ్యర్థులను ప్రకటించ డంలో మరింత జాప్యం జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను ఆదివారం ప్రకటిస్తారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వెల్లడించారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలు దూమ్‌ధామ్‌గా జరపాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందాయి.


Related News